పెరుగులో ఈ ఒక్కటి కలిపి పెడితే మీ ముఖం మెరిసిపోతుంది

Published : Feb 01, 2025, 03:27 PM IST

Glowing Skin: చర్మ సమస్యలకు పెరుగు, పసుపు అద్భుతంగా పనిచేస్తాయి. మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గించి, చర్మానికి కాంతినిస్తాయి. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తాయి.

PREV
15
 పెరుగులో ఈ ఒక్కటి కలిపి పెడితే మీ ముఖం మెరిసిపోతుంది

ఈ రోజుల్లో కేవలం జుట్టు సమస్యలే కావు.. చర్మ సమస్యలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది  ఆడవారు పార్లర్ కు వెళ్లి ఖరీదైన చికిత్సలు తీసుకుంటారు. ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ కెమికల్స్ ను వాడితే చర్మం మరింత దెబ్బతింటుంది. మరిన్ని చర్మ సమస్యలు వస్తాయి. అందుకే చర్మ సమస్యలను నేచురల్ పద్దతిలో తగ్గించుకోవడం మంచిదని చెప్తారు. నేచురల్ గా చర్మ సమస్యలను తగ్గించడానికి పెరుగు బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25


పెరుగులో పసుపు వేసి ముఖానికి పెడితే ఏమౌతుంది?

పసుపు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మనందరికీ తెలిసిందే. ఇది ప్రతి ఒక్కరి వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ మసాలా దినుసును ఆడవాళ్లు ప్రతిఒక్క కూరలో ఖచ్చితంగా వేస్తుంటారు. ఇది వంటలను టేస్టీగా చేయడమే కాకుండా.. మంచి కలర్ ను కూడా ఇస్తుంది.

అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇది మన చర్మానికి కూడా మేలు చేస్తుంది. పసుపులో ఉండే సహజ లక్షనాలు మన చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి.

ఇక ఈ పసుపులో పెరుగును కలిపి ముఖానికి రాస్తే ముఖంపై ఉన్న మొటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ముఖం అందంగా మెరిసిపోతుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35

చర్మం బిగుతుగా, మెరిసిపోతుంది 

చలికాలంలో మన చర్మం పొడిబారడం సర్వసాధారణ సమస్య. అయినా ఇది ఎన్నో చర్మ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీరు పెరుగులో పసుపును మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీ చర్మం టైట్ గా అవుతుంది. అలాగే కాంతివంతంగా కనిపిస్తుంది. 

చర్మానికి నేచురల్ గ్లో వస్తుంది

చర్మం పొడిబారితే స్కిన్ జీవంలేనట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి వారు పెరుగులో కొంచెం శెనగపిండిని, పసుపును వేసి కలిపి ముఖానికి పెట్టుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్ ను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మీ చర్మానికి నేచురల్ గ్లో కూడా వస్తుంది. 
 

45

మొటిమలు, మచ్చలు తగ్గుతాయి

మొటిమలు, మచ్చలు ఇబ్బంది పెడుతుంటే.. పెరుగులో పసుపును కలిపి ముఖానికి పెట్టండి. కాసేపు సున్నితంగా మసాజ్ చేయండి. కావాలనుకుంటే మీరు పెరుగులో ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ను కూడా కలపొచ్చు. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. 

జిడ్డు చర్మానికి పసుపు, పెరుగు 

చలికాలమైనా, ఎండాకాలమైనా కాలుష్యం వల్ల మన చర్మం జిడ్డుగా అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ ముఖాన్ని కడిగిన తర్వాత పెరుగు, పసుపు పేస్ట్ ను పెట్టి కొద్దిసేపు మసాజ్ చేయాలి. ఇది ముఖంపై ఉన్న జిడ్డును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. 
 

55

సున్నితమైన చర్మానికి పసుపు 

సున్నితమైన చర్మం ఉన్నవారికి పసుపు వాడకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని సాఫ్ట్ గా, ఆరోగ్యంగా ఉంచుతాయి. 

click me!

Recommended Stories