మీరా రాజ్ పూత్ సీక్రెట్ హెయిర్ ఆయిల్ రెసిపీ ఇదే..!

First Published | Jul 23, 2024, 11:09 AM IST

ఆయుర్వేదం ప్రకారం.. ఓ సీక్రెట్  హెయిర్ ఆయిల్ ఫాలో అవుతారట.  ఆఆయిల్ కారణంగా.. ఆమె జుట్టు చాలా అందంగా , ఒత్తుగా మారిపోతుందట.  మరి ఆ సీక్రెట్ ఆయిల్ ఎలా తయారుచేయాలో మనం కూడా తెలుసుకుందాం..
 

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కి పరిచయం అవసరం లేదు. ఆయన భార్య మీరా రాజ్ పూత్ కూడా అందరికీ సుపరిచితమే. హీరోయిన్లను తలదెన్నే అందంతో మెరిసిపోతూ ఉంటుంది.  మీరా రాజ్ పూత్.. తన అందం, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. 

మీరారాజ్ పూత్  ఆయుర్వేదాన్ని చాలా ఎక్కువగా నమ్ముతారు. తీసుకునే ఆహారం విషయంలోనూ ఆమె ఆయుర్వేదాన్ని ఫాలో అవుతూ ఉంటారు.అంతేకాదు.. ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం పెరిగేందుకు కూడా.. ఆయుర్వేదం ప్రకారం.. ఓ సీక్రెట్  హెయిర్ ఆయిల్ ఫాలో అవుతారట.  ఆఆయిల్ కారణంగా.. ఆమె జుట్టు చాలా అందంగా , ఒత్తుగా మారిపోతుందట.  మరి ఆ సీక్రెట్ ఆయిల్ ఎలా తయారుచేయాలో మనం కూడా తెలుసుకుందాం..


మీరా సీక్రెట్ హెయిర్ ఆయిల్  తయారు చేయడానికి ఏమేమీ కావాలో చూద్దాం... మందారపూలు, కరివేపాకు, మెంతులు, కొబ్బరి నూనె, ఉసిరికాయ పొడి, వేపాకు, మునగాకులు.

Image: FreePik

ఇప్పుడు ఆయిల్ ఎలా తయారుచేయాలో చూద్దాం... రెండు మందారపూలు, ఎనిమిది నుంచి పది వరకు మందార ఆకులు, కొంచెం కొబ్బరి నూనె వేసి.. దీని మొత్తాన్ని మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. మందార ఆకులు, మందారపూల్లో అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి.

తర్వాత.. ఒక ప్యాన్ తీసుకొని  దాంట్లో కొబ్బరి నూనె వేసి మరగనివ్వాలి. అందులో ముందుగా పేస్టు చేసుకొని ఉంచుకున్న మందార ఆకు, పూల పేస్టు వేసి మరగనివ్వాలి.  కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టురాలడం సమస్యను తగ్గిస్తుంది.

hibiscus

ఇప్పుడు... మందార ఆకుల పేస్టు నూనెలో మరుగుతుండగా.. అందులో... మెంతులు వేయాలి. మెంతుల్లో ఫ్లేవనాయిడ్స్  ఉంటాయి. ఇవి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి. తర్వాత.. ఆ నూనెలో ఉసిరికాయ పొడిని , కరివేపాకులు వేసి మరగనివ్వాలి. ఉసిరికాయ పొడి, కరివేపాకు జుట్టు తొందరగా తెల్లగా మారకుండా ఉండటానికి సహాయం చేస్తాయి.

ఇప్పుడు.. అదే నూనెలో వేపాకులు, మునగాకులు కూడా వేసి మరగనివ్వాలి. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తాయి. ఇక.. మునగాకుల్లో ఒమేగా 3 ఫ్యాటీ  యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి.

Hair Oils

ఇప్పుడు అన్నీ వేసేసి తర్వాత.. ఆ కొబ్బరి నూనెను మంచిగా మరిగించిన తర్వాత.. ఆ నూనెను వడపోయాలి. అంతే.. ఈ నూనెను ఏదైనా గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనె ను రాత్రిపూట తలకు పట్టించి.. ఉదయాన్నే షాంపూ చేస్తే సరిపోతుంది.. రెగ్యులర్ గా ఈ నూనె వాడటం వల్ల.. జుట్టు అందంగా , ఒత్తుగా మారుతుంది. మీరా రాజ్ పూత్ రెగ్యులర్ గా నూనెను వాడతారట. మరి, మీరు కూడా ప్రయత్నించి చూడండి.

Latest Videos

click me!