ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మనం అప్ డేట్ కాకపోతే.. బతకలేం అనుకుంటారు చాలా మంది. అందుకే అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌తో వాళ్లను వారు అప్డేడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీనిలో తప్పేం లేదు. చాలా మంది ట్రెండుకు తగ్గట్టు లేకపోతే.. వారిని మనుషులుగా చూడటం కూడా మానేస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నావంటూ వెక్కిరించడం మొదలుపెడుతుంటారు. దీనివల్లే చాలా మంది మారుతున్న కాలానికి అనుగుణంగా వారి అలవాట్లను కూడా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యాషన్ పరంగా. కానీ ఈ ఫ్యాషనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల వారికి తెలియకుండానే ఎంతోమంది అమ్మాయిలు రోగాల బారిన పడుతున్నారు. అందుకే మనం ఫాలో అయ్యే ఫ్యాషన్ మన ఆరోగ్యాన్ని లేదా జీవనశైలిని ఏ విధంగానైనా ప్రభావితం చేస్తే దానికి దూరంగా ఉండటమే మంచిది. స్టైలీష్ కోసం వాడే కొన్ని వస్తువుల వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
high heels
హైహీల్స్
మోడ్రన్ , వెస్ట్రన్ డ్రెస్సుల మీదికి చాలా మంది ఫ్లాట్ చెప్పులకు బదులుగా హై హీల్స్ నే ఎక్కువగా వాడుతుంటారు. వీళ్లతో పాటుగా పొట్టిగా ఉన్నవారు పొడుగ్గా కనిపించాలని కూడా హై హీల్స్ ను వేసుకుంటుంటారు. ఇవి చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని వేసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. హైహీల్స్ ని ఎప్పుడూ వేసుకోవడం వల్ల పాదాల నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
high heels
మీకు తెలుసా? హై-హీల్స్ ను వేసుకోవడం వల్ల చీలమండలు, మోకాలు, మడమలు వంటి చాలా ప్రాంతాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే మొత్తం ఒత్తిడి పాదం, ముందు భాగం పైనే పడుతుంది. ఇది వెన్నెముక, మోకాళ్లు, పాదాల్లో ప్రమాదకరమైన నొప్పి, సమస్యలకు దారితీస్తుంది.
Jeans
టైట్ జీన్స్
అబ్బాయిలకంటే అమ్మాయిలే టైట్ జీన్స్ ను వేస్తారు. ఇది మంచి షేప్ ను ఇస్తుంది. కానీ ఆడవాళ్లు చేసే అతిపెద్ద తప్పుల్లో ఇది ఒకటి. టైట్ జీన్స్ చూడాలనుకుంటే ఇది అందమైన రూపాన్ని ఇవ్వడమే కాకుండా.. మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా టైట్ జీన్స్ పొత్తికడుపు ప్రాంతంలో బాగా ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల గుండెల్లో మంట, త్రేనుపు, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
మీరు ఎప్పుడూ టైట్ జీన్స్ ను వేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దీనివల్ల మీ నరాల పనితీరు ప్రభావితమవుతుంది. ఇది విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్ సమస్యలను కలిగిస్తుంది. దీనిని టైట్ జీన్ సిండ్రోమ్ అని కూడా అంటారు.
హ్యాండ్ బ్యాగ్
పెళ్లైన ఆడవారే కాదు.. పెళ్లికాని ఆడవారు కూడా ఖచ్చితంగా హ్యాండ్‌బ్యాగ్ ను వేసుకుంటారు. కానీ వీటిని మీరు వేసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బయటికి వెళ్లేటప్పుడు మనకు కావాల్సిన వస్తువులన్నింటినీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసి తీసుకెళ్తుంటాం. అయితే చాలా మంది ఆడవారే చేసే అతిపెద్ద తప్పు.. అవసరం ఉన్నా.. లేకున్నా.. చేతికి దొరికినవన్నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేస్తుంటారు. ఈ వస్తువులన్నింటినీ బుజానికి వేసుకుని మోయడం వల్ల భుజం, చేయి , మెడ ప్రాంతాలపై చాలా ఒత్తిడి పడుతుంది. అలాగే భుజం నొప్పి, మెడ నొప్పి, ఒత్తిడి, మెడ ఎముకలలో నొప్పి, వెన్నెముకలో నొప్పి కలుగుతుంది.
పంప్-అప్ బ్రా
ఆడవాళ్లు లో దుస్తుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది బ్రా దరిస్తే.. మరికొంత మంది వీటికి దూరంగా ఉంటారు. కానీ చాలా మంది ఈ కాలంలో బ్రాలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇంతకు ముందు ఇప్పుడు ఉన్నన్ని బ్రా రకాలు ఉండేవి కావు. ఆకర్షణీయంగా, ఫ్యాషన్‌గా ఉండటానికి పుష్-అప్ బ్రాలు, పంప్ అప్ బ్రాలు, బాల్కనెట్ బ్రాలు, స్ట్రాప్‌లెస్ బ్రాలు వంటి బ్రాలను మహిళలు ఎక్కువగా ధరిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది టైట్ బ్రాలు వేసుకుంటారు. కానీ ఇవన్నీ రొమ్ములపై ఒత్తిడిని పెంచుతాయి. అలాగే శ్వాస సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి.