ఇక, ఈ కాలం అమ్మాయిల్లో కామన్ గా ఉండే భావన ఏంటంటే.. మేకప్ వేసుకుంటేనే అందంగా కనపడతాం అని నమ్ముతుంటారు. కానీ, మేకప్ లేకుండా, మీరు మీలా ఉంటే కూడా అందంగా కనపడొచ్చు. ఆత్మశిశ్వాసంతో ముందుకు సాగచ్చని సాయి పల్లవి నిరూపించింది.
అంతేకాదు.. మనం ఎలా ఉన్నా.. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకునేలా ఉండాలి. సాయిపల్లవి తన ఫేస్ మీద పింపుల్స్ ఉన్నా.. ఏ రోజూ వాటి గురించి కుంగిపోలేదు. తాను ఎలా ఉన్నా.. తనని తాను యాక్సెప్ట్ చేసుకుంది. ఇది కూడా కచ్చితంగా నేర్చుకోవాల్సిందే.