రూ.500కోట్ల విలువచేసే నక్లెస్ కదా.. దాని రెప్లికా అంటే కనీసం ఏ లక్షల్లోనో, వేలల్లోనే ఉంటుంది అనుకుంటే మీరు పొరపడినట్లే. కేవలం రూ.178 కి ఓ వ్యక్తి ఆన్ లైన్ లో అమ్ముతుండటం విశేషం. దీనిని సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వీడియోలో, ఆభరణాల వ్యాపారి ఈ రెప్లికాలను ఉత్సాహంగా మార్కెట్ చేస్తున్నాడు, 'నీతా అంబానీ జీ నెక్లెస్ కేవలం రూ. 178కి అందుబాటులో ఉంది. వారు 'హోల్‌సేల్ మాత్రమే, రిటైల్ కాదు' అని చెబుతున్నారు.ఈ వీడియోకి దాదాపు , 3.15 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఇక కామెంట్స్ గురించి అయితే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.