నీతా అంబానీ మొదటి కల: తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని నీతా తన జన్మస్థలమైన గుజరాత్‌లో చేయాలని భావించింది. తాము గుజరాత్ నుంచి వచ్చామని ఆమె చెప్పారు. ముఖేష్ ,అతని తండ్రి అక్కడ రిఫైనరీని నిర్మించారు. అక్కడే పెళ్లి చేయాలని ఉందని నీతా అంబానీ తన కోరిక బయటపెట్టారు. అనంత్, రాధికల మొదటి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కూడా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది.
నీతా అంబానీ రెండవ కోరిక: కళ , సంగీతం పట్ల అమితమైన ఆసక్తి ఉన్న నీతా అంబానీ ఈ వేడుక మొత్తం కళ , సంస్కృతికి నివాళిగా ఉండాలని కోరుకున్నారు.