కాజల్ నుంచి రష్మిక వరకు.. మన హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా?

First Published | May 29, 2024, 7:42 PM IST

మన హీరోయిన్స్.. ఎవరు ఏం చదువుకున్నారో మీకు తెలుసా..? ఎంత వరకు చదువుకొని  తర్వాత.. ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టారో, చదువుల్లోనూ టాప్ లేపి.. ఇక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకున్నారో ఇప్పుడు  తెలుసుకుందాం...
 


సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కామన్ పీపుల్ ముఖ్యంగా ఫ్యాన్స్ కి ఎక్కువగా ఉంటుంది. వాళ్ల గురించి తెలుసుకోవడానికే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. హీరోలకంటే... సోషల్ మీడియాలో ఫాలోయింగ్ హీరోయిన్లకే ఎక్కువగా ఉంటుంది అనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. మన హీరోయిన్స్.. ఎవరు ఏం చదువుకున్నారో మీకు తెలుసా..? ఎంత వరకు చదువుకొని  తర్వాత.. ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టారో, చదువుల్లోనూ టాప్ లేపి.. ఇక్కడ స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకున్నారో ఇప్పుడు  తెలుసుకుందాం...


1.శ్రుతి హాసన్..
స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా... తన స్కిల్స్ తో అందరినీ మెప్పించిన నటి శ్రుతి హాసన్. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకుంది. బాలీవుడ్ లోనూ నటించి ఆకట్టుకుంది. కాగా.. సింగర్ గా కూడా  అందరికీ తన టాలెంట్ చూపించింది.  శ్రుతి తన కెరీర్‌తో పాటు తన చదువును కూడా పూర్తి చేసింది. ఆమె ముంబైలోని సెయింట్ కాలేజీ నుండి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.



2.సమంత....
సౌత్ నటి సమంతకు కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందం, అభినయంతో బాలీవుడ్ బ్యూటీలను సైతం బీట్ చేస్తుంది సమంత. నటి కామర్స్‌లో డిగ్రీ చేసింది. చదువుల్లో మంచి టాపర్. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకునేదట.

సాయి పల్లవి
సౌత్ బ్యూటీ సాయి పల్లవి తన రాబోయే చిత్రం రామాయణం కోసం కష్టపడుతోంది. మరోవైపు నాగ చైతన్యతో తండేల్ లోనూ నటిస్తోంది..సాయి పల్లవి టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో తన వైద్య విద్యను పూర్తి చేసింది. హీరోయిన్ కాకపోయి ఉంటే.. డాక్టర్ అయిపోయేది.

Nayanatara

నయనతార

ఈ జాబితాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నయనతార కూడా చేరింది. ఆమె దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రాలలో పనిచేసింది. నటి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందింది.

కాజల్ అగర్వాల్

సౌత్ సినిమాల్లో తన యాక్టింగ్ మ్యాజిక్ చూపించిన కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల్లో కూడా పని చేసింది. నటి చదువు గురించి మాట్లాడితే, ఆమె జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేసింది.

Latest Videos

click me!