మాల్దీవ్స్ షాకింగ్ నిర్ణయం.. పాపం హీరోయిన్లు..!

First Published May 7, 2021, 11:23 AM IST

బికినీల్లో వారి అందాలను.. ఫోటోల్లో చూసుకొని అభిమానులు కూడా మురిసిపోయారు. అయితే.. ఇప్పుడు మాల్దీవ్స్ లో  సరికొత్త ఆంక్షలు పెట్టారు. హీరోయిన్ల ఆశలపై నీళ్లు చల్లారు.

వెకేషన్ అనగానే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు మాల్దీవులు. సినిమా హీరోయిన్లు.. ఈ మధ్యకాలంలో తరచూ.. తుమ్మినా, దగ్గినా.. మాల్దీవులకు చెక్కేస్తున్నారు. చాలా మంది హీరోయిన్ల ఫేవరేట్ డెస్టినేషన్ ఏది అనగానే వారి నోట ముందుగా మాల్దీవుల పేరే వినపడుతోంది.
undefined
ఆ మధ్య పెళ్లి కాగానే కాజల్ అగర్వాల్ తన భర్త తో కలిసి హనీమూన్ కి మాల్దీవులకే వెళ్లింది. కేవలం కాజల్ మాత్రమే కాదు... సమ్మర్ మొదలుకాకముందు..చాలా మంది బ్యూటీలు అక్కడికి వెళ్లి సందడి చేశారు. వారిలో పూజా హెగ్డే , తాప్సీ, అలియా భట్, శ్రద్ధాకపూర్, రకుల్, ఐశ్వర్యా రాజేష్, శివానీ, సమంత, జాన్వీ కపూర్ ఇలా చాలా మందే ఉన్నారు. అందరూ బికినీల్లో ఫోటో షూట్స్ చేసి.. వాటిని సోషల్ మీడియాల్లో కూడా షేర్ చేశారు.
undefined
బికినీల్లో వారి అందాలను.. ఫోటోల్లో చూసుకొని అభిమానులు కూడా మురిసిపోయారు. అయితే.. ఇప్పుడు మాల్దీవ్స్ లో సరికొత్త ఆంక్షలు పెట్టారు. హీరోయిన్ల ఆశలపై నీళ్లు చల్లారు.
undefined
ఇంతకీ మ్యాటరేంటే...భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో... ఇక్కడి నుంచి వచ్చే టూరిస్ట్ లపై మాల్దీవుల్లో ఆంక్షలు విధించారు. భారత్ నుంచి మాల్దీవులకు ఎవరినీ అనుమతించడం లేదు.
undefined
మొన్నటి వరకు ఈ హీరోయిన్లంతా.. మాల్దీవులకు వెళ్లేందుకు ఎందుకంత ఉత్సాహం చూపిస్తున్నారనేది చాలా మందికి తెలీదు. దాని వెనక పెద్ద సీక్రెటే ఉందని తెలుస్తోంది. గతంలో మాల్దీవులకు ఎక్కువ మంది వెళ్లేవారు కాదు.. అయితే.. టూరిస్ట్ లను ఎట్రాక్ట్ చేయడానికి అక్కడి ప్రభుత్వం ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.
undefined
ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండే సెలబ్రెటీలతో.. చిన్నపాటి డీల్ చేసుకుంటారనమాట. వారికి అక్కడ ఫైవ్ స్టార్ హోటల్, ఫుడ్ అన్నీ ఉచితంగానే అందిస్తారు. వాళ్లు చేయాల్సిందల్లా.. ఆ హోటల్, అక్కడి పరసరాలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ ఛేయడమే. దాని వల్ల వారి ఫాలోవర్స్ కూడా మాల్దీవులకు రావడానికి ఆసక్తి చూపిస్తారనేది వారి ప్లాన్.
undefined
అందుకే అందమైన తారలంతా అక్కడికి వెళ్లి మొన్నటి వరకు సందడి చేశారు. అయితే.. ఇప్పుడు సడెన్ గా కరోనా మహమ్మారి భారత్ లో ఎక్కువగా ఉండటంతో.. భారతీయులను అనుమతించడం లేదు. దీంతో.. హీరోయిన్లు కూడా అక్కడి అందాలతోపాటు.. అక్కడి వారు ఇచ్చే బంపర్ ఆఫర్ ని కోల్పోయారు.
undefined
click me!