అనుష్క శర్మ బాత్రూమ్ సీక్రెట్ ఇదే..!

First Published | May 4, 2021, 3:12 PM IST

బయట మార్కెట్లో లభించే క్రీములకన్నా కూడా.. ఇంటి చిట్కాలకే అనుష్క ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. 

అందంగా మెరిసిపోవాలని.. హీరోయిన్లను మించిన అందం దక్కించుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. అందుకోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఈ కరోనా భయంతో బ్యూటీ పార్లర్ కి వెళ్లే అవకాశం అందరికీ లభించడం లేదు. ఇక మార్కెట్లో లభించే కొన్ని క్రీములు పెద్దగా పనిచేస్తాయనే గ్యారెంటీ కూడా ఇవ్వలేం. మరి అందంగా ఉండటమెలా అంటే.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సీక్రెట్ రెమిడీని మనం కూడా ఫాలో అయితే సరిపోతుంది.
అనుష్క శర్మకు ఎప్పుడూ లైట్ మేకప్ మాత్రమే ఇష్టం. ఎక్కువ మేకప్ ని ఆమె పెద్దగా ఇష్టపడదు.

బయట మార్కెట్లో లభించే క్రీములకన్నా కూడా.. ఇంటి చిట్కాలకే అనుష్క ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అందుకే ఆమె.. ప్రతిరోజూ స్నానానికి ముందు అరటి పండు శరీరానికి రద్దుకుంటారట. ఆ తర్వాత స్నానం చేస్తారట. దాని వల్లే ఆమె మరింత తాజాగా, అందంగా కనిపిస్తానని చెబుతున్నారు.
ఒక్కోసారి అరటి పండు గుజ్జులో నిమ్మరసం... లేదా తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తారట. దీని వల్ల మరింత అందంగా కనిపించే అవకాశం ఉంది.
శరీరం, ముఖంపై ముడతలు పోగొట్టాలంటే కూడా అరటి పండు సహాయం చేస్తుంది. అందంగా కనిపించేలా చేస్తుంది.
అరటి గుజ్జులో బేకింగ్ సోడా, పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే... మొటిమల సమస్య తగ్గుతుంది. ఫేస్ చాలా క్లీన్ గా కనపడుతుంది.
ముఖం జిడ్డుగా అనిపించిన సమయంలో అరటి పండు వినియోగిస్తే.. అది ఆ జిడ్డుతనాన్ని తగ్గిస్తుంది.
కేవలం అరటి పండు మాత్రమే కాదు.. అరటి తొక్క వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అరటి తొక్క శరీరంపై రుద్దడం వల్ల కూడా కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయట.
అందుకే అనుష్క శర్మ ప్రతిరోజూ అరటి పండు తన స్కిన్ కేర్ రోటీన్ కోసం ఉపయోగిస్తారు. అందుకే.. ఆమె అంత అందంగా మెరిసిపోతున్నారు.

Latest Videos

click me!