యవ్వనంగా ఉండాలని అందరూ ఆశపడుతుంటారు. కానీ కొందరు మాత్రం చిన్న వయసులోనే ఎక్కువ వయసు ఉన్నవారిలా కనపడతారు. 30ఎళ్లకే ముఖంలో వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి. దీంతో.. కంగారుపడుతూ ఉంటారు. అయితే.. మీకు కూడా అలాకాకుండా ఉండాలంటే.. ఇదిగో ఈ చిన్నచిట్కాలతో మళ్లీ యవ్వనంగా మెరిసిపోయే అవకాశం ఉంటుంది.
undefined
యవ్వనంగా కనిపించాలి అంటే.. ముందుగా మనం తినే ఆహారం పై దృష్టి పెట్టాలి. మనం తీసుకునే ఆహారం మీదే మన లుక్స్ ఆధారపడి ఉంటాయట. నాన్ వెజ్ తినడం తగ్గించి.. కూరగాయలు, చిరు ధాన్యాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. అంతేకాదు.. ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగాలి. మీ బరువు, ఎత్తు ప్రకారం ఆహారం తీసుకోవాలి.
undefined
వయసు పెరుగుతున్న కొద్దీ.. చాలా మంది రాత్రిపూట నిద్రపట్టడం లేదని చెబుతూ ఉంటారు. అయితే.. ప్రతిరోజూ కనీసం 8 నుంచి 9 గంటల నిద్ర చాలా అవసరం. అలా నిద్రపోయినప్పుడు మాత్రమే యవ్వనంగా కనపడతారు. నిద్ర సరిగా పోని సమయంలో.. ఏదో ఒక అనారోగ్యం దరిచేరే అవకాశం ఉంటుంది.
undefined
వయసు పెరుగుతున్న కొద్దీ తినే ఆహారం తగ్గించాలి. టీనేజ్ లో ఉన్నట్లుగా ఎంత పడితే అంత తినేయకూడదు. లిమిటెడ్ గా తినాల్సి ఉంటుంది. వయసు పరుగుతుంటే అనేక సమస్యలు వస్తుంటాయి. కాబట్టి... అరుగుదల సమస్య రాకుండా ఉండేందుకు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.
undefined
వ్యాయామం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, లేదా ఇంకేదైనా వ్యాయామం చేయాలి. ఉదయం లేదా.. సాయంత్రం ఒక గంట సమయం కేటాయించి వ్యాయామం చేయాలి. దానివల్ల యవ్వనంగా కనిపిస్తారు.
undefined
మనసు, మెదడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అందుకోసం స్నేహితులను పెంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు మెదడు ప్రశాంతత చాలా అవసరం. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. మనసులోని బాధలను ఎవరితో ఒకరితో పంచుకోవాలి.
undefined