
చలికాలమైనా, ఎండాకాలమైనా ఫ్రిజ్ ను మాత్రం పక్కాగా వాడుతుంటారు. ఏ కాలమైనా చాలా మంది ఇండ్లలో ఫ్రిజ్ వాడకం ఒకేవిధంగా ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ ని ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచడానికి ఫ్రిజ్ సహాయపడుతుంది. అయితే చాలా సార్లు ఇంట్లో వండిన ఆహారాలు మిగిలిపోతుంటాయి.
ఇలాంటి వాటిని ఫ్రిజ్ లో పెట్టేసి ఉదయమో, సాయంత్రమో తింటుంటారు. ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి తొందరగా కుల్లిపోవు. పాడైపోవు. ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంటాయి. కానీ ఫ్రిజ్ లో ఫుడ్ ను ఎక్కువ సేపు ఉంచడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఫ్రిజ్ లో వేటిని ఎంత సేపు ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పిండిని ఎంతసేపు ఫ్రిజ్ లో ఉంచాలి?
ఉదయం, సాయంత్రం ఒకే పిండితో చేసిన చపాతీలను, రొట్టెలను తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఇలాంటి వారు ఉదయం కలిపిన పిండిని ఫ్రిజ్ లో పెట్టేసి సాయంత్రం చేసుకుని తింటుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచిన పిండి ఆరోగ్యానికి మంచిది కాదు.
సాధారణంగా ఉదయాన్నే కలిపిన పిండిని సాయంత్రం వరకు ఫ్రిజ్ లో ఉంచి సాయంత్రం దానితో చపాతీలు చేసుకుని తినొచ్చు. కానీ దీన్ని 2-3 రోజుల వరకు వాడకూడదు. ఎందుకంటే దీనిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని తింటే మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
అన్నాన్ని ఎంత సేపు ఫ్రిజ్ లో ఉంచాలి?
అన్నాన్ని ఎక్కువ సేపు ఫ్రిజ్ లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే అన్నాన్ని ఫ్రిజ్ లో ఎక్కువ సేపు ఉంచితే దానిలో బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఈ అన్నాన్ని తినడం కడుపునకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. అన్నాన్ని ఫ్రిజ్ లో ఒక రోజు నిల్వ చేయడం మంచిదే. కానీ ఇంతకు మించి ఉంచి తింటే మాత్రం మీకు లేనిపోని కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అజీర్ణం సమస్య వస్తుంది.
పప్పు చారును ఫ్రిజ్ లో ఎన్ని రోజులు ఉంచాలి?
పప్పు చారును ఫ్రిజ్ లో రెండు రోజులకు మించి ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు. ఇంతకంటే ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉన్న పప్పు చారును తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉడికించిన పప్పులను ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో నిల్వ చేస్తే దానిలో ఉన్న పోషకాలు నశిస్తాయి. ఈ పప్పులను తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
ఇలా వండిన కూరగాయలను స్టోర్ చేయండి
ఏ కూర వండినా దానిని ఫ్రిజ్ లో నాలుగైదు గంటలు మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత వాడేయాలి. ముఖ్యంగా మసాలా కూరగాయలను ఇంతకు మించి నిల్వ అస్సలు చేయకూడదు. నిజానికి కూరగాయల్ని ఫ్రిజ్ లో ఎక్కువ సేపు నిల్వ ఉంచితే దాని రుచి చెడిపోతుంది. అలాగే ఇవి ఆరోగ్యానికి మంచివి కావు.
ఆహారాన్ని ఫ్రిజ్ లో ఎలా నిల్వ చేయాలి?
వండిన ఆహారాల్ని ఫ్రిజ్ లో పెట్టేముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముందుగా మీ ఫ్రిజ్ క్లీన్ గా ఉండాలి. ఎందుకంటే ఫ్రిజ్ మురికిగా ఉంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫ్రిజ్ లో పెట్టిన ఆహారాన్ని త్వరగా చెడిపోయేలా చేస్తుంది. అందుకే ఫుడ్స్ ఐటమ్స్ ను ఫ్రిజ్ లో పెట్టడం మానుకోండి. అలాగే ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే ఫ్రిజ్ లో ఉంచి తర్వాత తీయండి. ఆహారాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేసేటప్పుడు దాని ఉష్ణోగ్రతను 2 నుంచి 3 డిగ్రీల వద్ద ఉంచండి.