బేకింగ్ సోడా
బేకింగ్ సోడాతో కూడా పాత పైపులను కూడా కొత్తవాటిలా మెరిసేలా చేయొచ్చు. ఇందుకోసం రెండు చెంచాల బేకింగ్ సోడాలో 2 చెంచాల నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్, అరకప్పు వెనిగర్ ను వేసి బాగా కలపండి. దీనిలో ఒక కప్పు నీళ్లు పోయండి. దీన్ని పాలిథిన్ కవర్ లో పోయండి. దీన్ని పైపులపై స్క్రబ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం వాడని టూత్ బ్రష్ తో ఒకసారి స్క్రబ్ చేసి శుభ్రం చేయండి. అంతే మరకలు పోయి పైపులు కొత్తవాటిలా కనిపిస్తాయి.
షవర్ ను శుభ్రం చేయడానికి ముందుగా షవర్ నుంచి నీళ్లు సరిగ్గా వస్తున్నాయో? లేవో? చెక్ చేయండి. షవర్ లోని అన్ని రంధ్రాల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయో లేవో చూసుకోవాలి. ఎక్కడైనా నీళ్లు రాకపోతే వాటిని శుభ్రం చేయండి. ఆ తర్వాత షవర్ ను క్లీన్ చేయడానికి ఈ పద్దతులను పాటించండి.