పీవీ సింధు గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

First Published Aug 2, 2021, 10:14 AM IST

అందుకే.. సింధుకి కూడా క్రీడల పట్ల అంత ఆసక్తి కలిగి ఉండవచ్చు. మరో విషయం ఏమిటంటే.. సింధు తండ్రి రమణ.. కి 2000 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా దక్కింది.
 

బ్యాడ్మింటన్ ప్లేయర్, మన తెలుగు తేజం పీవీ సింధు.. మరోసారి సత్తా చాటింది. టోక్యో ఒలంపిక్స్ లో సత్తాచాటి.. దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో సింధు.. కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఒలంపిక్స్ లో వరసగా రెండు పతకాలు గెలిచిన ఘనత కూడా సింధునే గెలుచుకుంది. కాగా.. ఈ సింధు గురించి కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందామా..!

P V Sindhu

1.పీవీ సింధు.. 1995, జులై 5వ తేదీన పీవీ రమణ, పీ. విజయ దంపతులకు జన్మించింది. కాగా.. ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. పీవీ సింధు తల్లిదండ్రులు కూడా క్రీడాకారులు కావడం గమనార్హం. జాతీయ స్థాయిలో వాలీబాల్ ప్లేయర్స్. అందుకే.. సింధుకి కూడా క్రీడల పట్ల అంత ఆసక్తి కలిగి ఉండవచ్చు. మరో విషయం ఏమిటంటే.. సింధు తండ్రి రమణ.. కి 2000 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా దక్కింది.

pv sindhu

2.పీవీ సింధుకి చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ పైన ఆసక్తి ఉంది. ప్రతిరోజూ ఆమెను తండ్రి రమణ.. ఉదయాన్నే 3గంటలకు పుల్లెల గోపీచంద్ అకాడమీకి తీసుకువెళ్లేవారు. ఆ స్టేడియంకు వెళ్లడానికి వారు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. వెళ్లడం.. రావడం మొత్తం 120 కిలోమీటర్ల ప్రయాణం ప్రతిరోజూ చేసేది. దాదాపు 12 సంవత్సరాలపాటు ఆమె ఇలా ప్రయాణం చేయడం గమనార్హం.
undefined
3.పీవీ సింధుకి అక్క కూడా ఉంది. ఆమె వివాహం 2012లో జరగగా.. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కారణంగా.. ఆ పెళ్లికి సింధు హాజరుకాలేకపోవడం గమనార్హం. అప్పుడు లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ కోసం ఆమె తలపడింది.

PV Sindhu With parents

4.2016 రియో ఒలంపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది. ఒలంపిక్స్ లో రజతం గెలిచిన తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు కావడం గమనార్హం. ఒలంపిక్స్ పై శ్రద్ధ పెట్టేందుకు.. ఆమె దాదాపు 3 నెలల పాటు.. ఫోన్ కి దూరంగా ఉంది. ఒలంపిక్స్ గెలిచిన తర్వాత.. ఆమెకు ఫోన్ ఇచ్చానని ఆమె కోచ్ గోపీచంద్ చెప్పడం గమనార్హం.

PV Sindhu

5.2016లో సిల్వర్ గెలిచిన తర్వాత.. ఆమెకు సచిన్ టెండుల్కర్.. మర్యాదపూర్వకంగా బీఎండబ్ల్యూ కారు బహుమతిగా అందజేశారు.
undefined
6.బ్యాడ్మింటన్ ట్రైనింగ్ లేని సమయంలో.. పీవీ సింధు.. స్విమ్మింగ్.. యోగా, మెడిటేషన్ చేస్తుంటుంది. స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలను ఆమె చాలా సార్లు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

pv sindhu

7. పీవీ సింధుకి బ్యాడ్మింటన్ లో అతి పెద్ద పోటీ ఇచ్చేది.. ఏ వరల్డ్ చాంపియన్ కాదట.. ఆమె మేనల్లుడు ఆర్యన్(చిన్న పిల్లాడు) . అతని తో కలిసి బ్యాడ్మింటన్ఆడిన వీడియోని గతంలో సింధు షేర్ చేసింది. తన సపోర్ట్ సిస్టమ్ కూడా అతనేనని ఆమె చెప్పడం విశేషం.
undefined
8.సింధు ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు చూస్తే.. ఆమె ఫుడ్డీ అన్న విషయం ఈజీగా ఎవరైనా చెప్పేస్తారు. ఆమెకు బాగా ఇష్టమైన ఫుడ్ తీయని పెరుగు. రియో ఒలంపిక్స్ సమయంలో.. ఆమెను కనీసం ఐస్ క్రీమ్ కూడా తినడానికి అనుమతించలేదని కోచ్ పుల్లెల గోపీచంద్ చెప్పారు. రియో లో విజయం తర్వాత.. ఆమె తనకు నచ్చినవి తినొచ్చు.. అంటూ గోపీచంద్ ఆ సమయంలో చెప్పారు.
undefined
click me!