డైట్ , వ్యాయామంతో పని లేకుండా.. పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడమెలా..?

First Published Oct 20, 2021, 2:19 PM IST

ఈ కొవ్వు కరిగించడానికి అందరూ ముందుగా చేసే పని డైటింగ్. ఆ తర్వాత వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు. అయితే.. వీటి వల్ల కూడా అంత తొందరగా.. కొవ్వు కరగదు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తొందరగా కరగదు.
 

belly fat

చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానమైనది ఇది. ఏది తిన్నా.. పొట్ట, నడుము ప్రాంతాల్లో మాత్రమే కొవ్వు పెరుగుతూ ఉంటుంది. దీంతో.. ఈ పెరిగిన నడుము భాగాన్ని ఎలా తగ్గించాలా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

శరీరంలో అధిక కొవ్వు లేనప్పటికీ, పొత్తి కడుపులో కొవ్వు మొత్తం క్రమంగా పెరుగుతోంది. కొద్దిగా జంక్ ఫుడ్ తిన్నా చాలు.. పెరిగిపోయి కూర్చుంటుంది. మరి ఈ బెల్లీ ఫ్యాట్ సమస్యను తగ్గించుకోవడం ఎలాగో నిపుణులు సలహా ఇస్తున్నారు.
 

belly fat


ఈ కొవ్వు వివిధ సమస్యలను కలిగిస్తుంది. కనుక దీనిని కొంచెంగా ఉన్నప్పుడే తగ్గించాలి. లేదంటే.. బాగా కొవ్వు పేరుకుపోయిన తర్వాత దానిని తగ్గించడం చాలా కష్టమౌతుంది.

ఈ కొవ్వు కరిగించడానికి అందరూ ముందుగా చేసే పని డైటింగ్. ఆ తర్వాత వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు. అయితే.. వీటి వల్ల కూడా అంత తొందరగా.. కొవ్వు కరగదు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తొందరగా కరగదు.

బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి చాలా మంది చాలా రకాల వ్యాయామాలు చెబుతుంటారు. కానీ.. కేవలం జీన్స్ ధరించడం వల్ల ఈ ఫ్యాట్ తగ్గించవచ్చని మీలో ఎంత మందికి తెలుసు..?

బెల్లీ ఫ్యాట్ కారణంగా చాలా మంది తమకు నచ్చిన దుస్తులను ధరించలేరు. ఒక వేళ వేసుకన్నా కూడా అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా మోడ్రన్ డ్రెస్సులు వేసుకోలేరు.

జీన్స్ అనే పదం దాదాపు అందరికీ బాగా తెలిసినది. ఈ జీన్స్ ధరించేవారికి మాత్రమే కాదు..  వేసుకోని వారికి కూడా దీని గురించి తెలుస్తుంది.. చాలా మందికి, జీన్స్ చాలా సౌకర్యవంతమైన దుస్తులు. కాగా.. ఇదే జీన్స్ తో ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ తగ్గించవచ్చట.
 

చాలా మంది బెల్లీ ఫ్యాట్ ని  తగ్గించడానికి వివిధ రకాల స్లిమ్మింగ్ బెల్ట్‌లను ఉపయోగిస్తారు. అయితే.. వీటిని అందరూ కొనుగోలు చేయలేరు. ఎందుకంటే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
 

కాబట్టి.. జీన్స్ ధరించి కొవ్వు కరిగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. High waist jeans ధరించడం వల్ల.. నడుము దగ్గర కొవ్వును తగ్గించవచ్చట. అయితే.. అనూహ్యంగా ఒకేసారి మార్పు రాకపోవచ్చు. కానీ.. నెమ్మది నెమ్మదిగా.. ఈ రకం జీన్స్ ధరించడం వల్ల.. బెల్లీ ఫ్యాట్ ని కొద్ది కొద్దిగా కరిగించవచ్చని చెబుతున్నారు.
 

click me!