హెవీ జ్యూవెలరీ.. చాలా మంది చీర కట్టుకుంటే చాలు భారీగా ఆభరణాలు ధరించేస్తూ ఉంటారు. అయితే.. నిజానికి పెళ్లి లాంటి వేడుకులకు అలా ధరిస్తే బాగుంటుంది. కానీ.. ప్రతిసారీ ఎక్కువ జ్యూవెలరీ ధరించడం కూడా అంత మంచిదేమీ కాదు. కాబట్టి.. సింపుల్ గా రెడీ అయినా కూడా అందంగా కనపడొచ్చు. చిన్న చెవిపోగులు, బ్రాస్లెట్, చిన్న గొలుసు లాంటివి ధరించాలి.