కత్రినా మెరిసే చర్మం వెనక రహస్యం ఇదే..!

Published : Oct 20, 2021, 12:54 PM IST

ఆమె అందానికి చర్మమే కారణమని చెప్పొచ్చు. ఆమె చర్మం ఎప్పుడూ మెరుస్తూ నిగారిస్తూ ఉంటుంది. మరి ఆమె చర్మం  అందంగా కనపడటానికి ఆమె ఏం చేస్తుందో ఇప్పుడు  చూద్దాం..

PREV
110
కత్రినా మెరిసే చర్మం వెనక రహస్యం ఇదే..!
Katrina Kaif

బాలీవుడ్ లోని అందమైన తారల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా.. కేవలం బాలీవుడ్ కే పరిమితం కాలేదు. టాలీవుడ్ లోనూ రెండు, మూడు చిత్రాల్లో నటించి మనల్ని అలరించారు.  అక్కడా, ఇక్కడా.. ఆమె అందానికీ, నటనకు ఫిదా కానివారంటూ ఎవరూ లేరు. దశాబ్దకాలానికి పైగానే ఆమె సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు.

210

త్వరలోనే బాలీవుడ్ క్రేజీ హీరో విక్కీ కౌశల్ తో ఆమె పెళ్లి జరగనుందంటూ ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ ప్రస్తుతం పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ బాలీవుడ్ మీడియా గుసగుసలాడుతోంది.
 

310

ఈ సంగతి పక్కన పెడితే.. సినీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు కత్రినా అందం ఎలా ఉందో.. ఇప్పటికీ అలానే ఉంది. ఆమె వయసు పెరుగుతున్నకొద్దీ.. అందం కూడా పెరుగుతూనే ఉంది. 

410

ఆమె అందానికి చర్మమే కారణమని చెప్పొచ్చు. ఆమె చర్మం ఎప్పుడూ మెరుస్తూ నిగారిస్తూ ఉంటుంది. మరి ఆమె చర్మం  అందంగా కనపడటానికి ఆమె ఏం చేస్తుందో ఇప్పుడు  చూద్దాం..

510

తన చర్మం అందంగా.. నిగారించడానికి తాను రెండు పదార్థాలను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించింది. ఓట్స్, తేనే కలిపి తన ముఖం నిగారించడానికి వినియోగిస్తుందట.

610

ఒక టేబుల్ స్పూన్ లో ఓట్స్ పౌడర్ ని తీసుకొని.. అందులో ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అది ఎండిపోయేంత వరకు ఆగాలి. ఆ తర్వాత  ముఖాన్ని నీటితో శుభ్రం  చేసుకోవాలి.
 

710

అప్పడప్పుడు కత్రినా.. తన ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుంటూ ఉంటుందట. దాని వల్ల తన ముఖం తాజాగా.. నిగారింపు కలిగిస్తుందని ఆమె చెబుతోంది.

810

ఇక ఎంత టైట్ షెడ్యూల్ లో ఉన్నా కూడా.. కత్రినా.. తన ఫిట్నెస్ ని అస్సలు వదిలిపెట్టదట. కచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేసేస్తుందట.  తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందట.
 

910

ముఖం పై ముడతలు పడకుండా ఉండేందుకు ఆమె ఫేషియల్ వ్యాయామాలు కూడా చేస్తుందట.వాటిని చేయడం వల్ల ముఖం అందంగా మెరవడంతోపాటు.. ముడతలు రాకుండా సహాయం చేస్తుందట.

1010

ఇక కత్రినాకి ఎక్కువగా మేకప్ వేసుకోవడం పెద్దగా ఇష్టం ఉండదట. సహజంగా ఉండేందుకు ఇష్టపడుతుంది. సినిమా షూటింగ్స్ లేని సమయంలో అస్సలు మేకప్ వాడదట. చర్మం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేలా చేస్తుందట.

click me!

Recommended Stories