జాన్వీ కపూర్... పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా పరిచయం అయినా...తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. వరస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
అంతేకాదు.. తన అందాన్ని సినిమాల్లో మాత్రమే కాకుండా....అప్పుడప్పుడు ఫోటో షూట్ లతోనూ అలరిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు చూసి....కుర్రకారు పిచ్చెక్కిపోవాల్సిందే.
janhavi
ఆమె సినిమాలు, అందం గురించి పక్కన పెడితే... జాన్వీ కపూర్ కి ఫుడ్ అంటే ఇష్టమట. ముఖ్యంగా ఫుడ్ కుక్ చేయడం అంటే మరింత ఎక్కువగా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
జాన్వీ ఇటీవల గుడ్ లక్ జెర్రీ అనే సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె మూమూస్ కుక్ చేస్తూ కనపడుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ తో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలో తనకు నూడిల్స్ తయారు చేయడం వచ్చని చెప్పింది. స్పైసీ, చీజ్ నూడిల్స్ తాను అద్భుతంగా చేయగలనని ఆమె చెప్పడం గమనార్హం. ఆ నూడిల్స్ ఎలా చేయాలో ఓసారి చూద్దాం..
1. ముందుగా.. కొన్ని ఉల్లిపాయలు తీసుకొని వాటి పొట్టు తొలగించి ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత... క్యాప్సికమ్, టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
2.ఆ తర్వాత ఓ ప్యాన్ తీసుకొని ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆతర్వాత నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత అందులో ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. ఆ ముక్కలు బాగా వేయించాలి.
3.ముక్కలు బాగా వేయించిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 200 ఎంఎల్ నీటిని పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో ఇన్ స్టాంట్ నూడిల్స్ వేసి ఉడకనివ్వాలి. దానిపై లిడ్ ఉన్న మూతను పెట్టాలి.
4.ఇప్పుడు.. నూడిల్స్ ఉతికిన తర్వాత మంట తగ్గించి.. అందులో ముందుగా వేయించిన కూరగాయ ముక్కలు, నూడిల్స్ మసాలా వేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
5.చివరగా అందులో చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ చీజ్ ని వేయాలి. ఆ తర్వాత చీజ్ కరిగేంత వరకు మూత పెట్టి ఉంచాలి. చీజ్ కరిగిన తర్వాత.. దీనిని వేడి వేడిగా ప్లేట్ లో పెట్టుకొని ఆరగించుకోవచ్చు.