ఈషా ధరించిన కుర్తా పలాజో సెట్ ప్రముఖ క్లాతింగ్ లేబుల్ డ్రజ్యా నుంచి రిధియే సూరి డిజైన్ చేశారు. పలాజో సెట్ ఆఫ్ 2తో కూడిన హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ (బ్లూ బూటా) కుర్తా అని ఈ సెట్‌ను పిలుస్తారు. సమ్మర్ కి పర్ఫెక్ట్ డ్రెస్ అని చెప్పొచ్చు. దీని ధర రూ.9,600 కావడం విశేషం.
ఈషా ఈ కాటన్ డ్రెస్ కి సింపుల్ బంగారు గొలుసు, మ్యాచింగ్ బ్యాంగిల్స్, తన కుమార్తె ఆదియా పేరు మోనోగ్రామ్‌తో కూడిన గోయార్డ్ టోట్ బ్యాగ్ , మింట్ గ్రీన్ రంగు బ్యాలెట్ షూలతో సింపుల్ గా స్టైల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్నాయి.