వర్క్.. పిల్లలు.. రెండూ బ్యాలెన్స్ చేయడమెలా?

First Published Mar 12, 2024, 12:13 PM IST

అనవసరంగా ఉద్యోగం మానేశాం అని, తమ కెరీర్ ముగిసిపోయిందని ఫీలౌతూ ఉంటారు. అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే... ఆ ఫీలింగ్ మీకు ఉండదు. వర్కింగ్ ఉమెన్ గా.. పిల్లలను పెంచడాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఈ రోజుల్లో చాలా మంది మహిళలు.. ఇంటిని చూసుకుంటూనే.. పిల్లలను చూసుకుంటున్నారు. అయితే... ఆ రెండు పనులు బ్యాలెన్స్ చేయడం అంత సులువైన విషయం కాదు. రెండు పనులు బ్యాలెన్స్ చేయడం కుదరక చాలా మంది... ఉద్యోగాలు మానేసిన వారు కూడా ఉన్నారు. మానేసిన తర్వాత... అనవసరంగా ఉద్యోగం మానేశాం అని, తమ కెరీర్ ముగిసిపోయిందని ఫీలౌతూ ఉంటారు. అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే... ఆ ఫీలింగ్ మీకు ఉండదు. వర్కింగ్ ఉమెన్ గా.. పిల్లలను పెంచడాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
 


1.సెల్ఫ్ కేర్..
మీరు మీ కెరీర్ లో ముందుకు దూసుకపోతూనే.. పిల్లలను బాగా చూసుకోవాలంటే.. ముందు.. మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకోవాలి.అంటే.. వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం లేదంటే... మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం  మంచిగా ఉండే అలవాట్లు ప్రాక్టీ స్ చేయాలి.
 

2.అంచనాలు..
ఆఫీసులో పని, ఇంటి బాధ్యతలు చూసుకునేటప్పుడు.. మీరు మీ మీద పెట్టుకునే అంచనాలు రియలిస్టిక్ గా ఉండేలా చూసుకోవాలి. సినిమాల్లో చూపించినట్లుగా మనకు జరిగే అవకాశం చాలా తక్కువ. మూవీల్లో హీరోయిన్లు చేసినట్లు అన్ని పనులు మీరే చేయలేరు.కాబట్టి.. నెత్తిమీద ఎక్కువ పనులు వేసుకోకుండా.. సాధ్యమైనంత వరకు మాత్రమే చేయాలి. లేదంటే.. ఎవరి సహాయం అయినా తీసుకోవాలి.
 

3.సపోర్ట్ సిస్టమ్..
ఏ పనీ ఒక్కరితో అవ్వదు. మీకు  కెరీర్, మరో వైపు మదర్ హుడ్ రెండూ కావాలి అనుకుంటే.. కచ్చితంగా మీకంటూ ఓ సపోర్ట్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా ఎవరైనా ప్రతి విషయంలో మీకు అండగా ఉండేలా మీరే చూసుకోవాలి. కెరీర్, పిల్లలు రెండూ బ్యాలెన్స్  చేయడానికి మీకు మంచి సలహాలు ఇవ్వడం నుంచి.. మంచిగా ఎంకరేజ్ చేసేలా చూసుకోవాలి. వాళ్లు మీకు తోడు ఉంటే.. మీ వర్క్ మరింత ఈజీ అవుతుంది.

4.పనిగంటలు..
ఆఫీసు పని గంటలు ఫ్లెక్సిబుల్ గా ఉండేలా చూసుకోవాలి. అలాంటి కంపెనీలో ఉద్యోగం చేస్తే.. మీకు మీ పిల్లలను చూసుకోవడానికి కూడా సమయం కుదురుతుంది. అటు ఆఫీసు పని.. ఇటు ఇంటి బాధ్యతలు నిర్వహించగలుగుతారు.

5.టైమ్ మేనేజ్మెంట్..
కెరీర్, మదర్ హుడ్ రెండూ ఆస్వాదించాలి అంటే.. టైమ్ మెనేజ్మెంట్ చాలా అవసరం. టైమ్ మేనేజ్మెంట్ తెలిస్తేనే.. రెండిటినీ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయగలరు. దేనికి ఎప్పుడు ఎంత టైమ్ ఇవ్వాలి అనేది తెలియాలి. రెండింటిలో ఏది ప్రయార్టీ అనేది కూడా తెలుసుకోవాలి. అప్పుడు మీరు.. సులభంగా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు.

6.కమ్యూనికేషన్..
ఇల్లు అయినా, ఆఫీసు అయినా.. కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. మీరు మీకు వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు.. అది మీ కొలిగ్స్, కుటుంబంతో నోరు తెరిచి చెప్పాలి. చెప్పకుండా ఎవరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి... ఒపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం అని గుర్తుపెట్టుకోవాలి.


7.ఇక.. చేస్తున్న రెండు పనుల్లోనూ తామే బెస్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేయవద్దు. చేస్తున్న పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు.. అది బరువుగా అనిపించదు.
 

click me!