కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి పెడితే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో..

First Published | Jul 25, 2024, 2:36 PM IST

పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ పొడవైన జుట్టు ఉండేవారు చాలా తక్కువే. అయితే కొబ్బరి నూనెలో ఒకటి కలిపి పెడితే జుట్టు ఖచ్చితంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే? 
 

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. హెయిర్ ఫాల్, చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం, డ్రై నెస్, జుట్టు   సన్నబడటం, బలహీనత, జుట్టు పెరగడం ఆగిపోవడం.. ఇలా ఎన్నో జుట్టు సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ ను వాడుతుంటారు చాలా మంది. ఈ కెమికల్స్ ప్రొడక్ట్స్ ను వాడటం వల్ల ఉన్న సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎంచక్కా కొబ్బరి నూనెను వాడండి. అవును కొబ్బరి నూనెలను మెంతులను కలిపి వాడితే జుట్టు ఊడిపోవడం తగ్గడంతో పాటుగా చుండ్రు తగ్గిపోతుంది. ఇంతేకాదు జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా కొబ్బరి నూనెలో మెంతులను కలిపి వాడితే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. జుట్టు పెరగడానికి మెంతులను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

జుట్టుకు కొబ్బరి నూనె ప్రయోజనాలు

మన జుట్టుకు కొబ్బరి నూనె చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన జుట్టుకు ఒక వరం లాంటిదే. అవును యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి.  
 

Latest Videos


కొబ్బరి నూనె, మెంతులు 

కొబ్బరి నూనెతో పాటుగా మెంతులు కూడా మన జుట్టుకు ఎంతో ప్రయోజరకంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి వాడటం వల్ల మన జుట్టు త్వరగా పొడవుగా పెరుగుతుంది. అలాగే ఎన్నో జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 
 

కొబ్బరి నూనెను, మెంతులను ఎలా ఉపయోగించాలి? 

మీ జుట్టు త్వరగా పెరగాలంటే.. దీన్ని జుట్టుకు ఉపయోగించడానికి ముందు కొబ్బరి నూనెలో మెంతులను వేసి మరిగించండి.  ఆ తర్వాత ఈ నూనెను వడగట్టి జుట్టుకు పెట్టి కొద్ది సేపు మసాజ్ చేయండి. 
 

మెంతులు, కొబ్బరి నూనెను జుట్టుకు ఎలా పెట్టాలి? 
 
జుట్టు సంరక్షణ కోసం కొబ్బరి నూనెలో 1 లేదా 2 టీస్పూన్ల మెంతులను వేసి బాగా వేడి చేయండి. ఈ మెంతులు ఎరుపు రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నూనెను చల్లారనివ్వండి. ఈ నూనెను జుట్టు మొదల్ల నుంచి చివర్ల వరకు బాగా పెట్టండి. 

పొడవైన జుట్టు 

మెంతులను వేసిన కొబ్బరినూనెను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల మీ జుట్టు పొడుగ్గా పెరుగుతంది. అలాగే ఒత్తుగా కూడా వస్తుంది. ఈ కొబ్బరి నూనెలో ఉండే ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టుకు లోపలి నుంచి పోషణను అందిస్తుంది. దీంతో జుట్టు ఊడిపోవడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. 
 

hair care

చుండ్రును తగ్గిస్తుంది

మెంతులు మన జుట్టుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. మెంతులు మన తలపై ఉండే చుండ్రును చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే నెత్తిమీద దురద నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. అలాగే మెంతులు బలహీనమైన జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. దీనివల్ల జుట్టు అంతగా రాలదు. అయితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం జుట్టు సంరక్షణ సరిగ్గా ఉండాలి. ఇందుకోసం నెత్తికి నూనె రాసుకుని సకాలంలో తలస్నానం చేయాలి.
 

click me!