జుట్టుకు నూనె ఇలా పెడితేనే ఫలితం..

First Published | Jul 26, 2024, 12:35 PM IST

జుట్టుకు నూనె పెట్టామా? లేదా? అనేది మాత్రమే పట్టించుకుంటారు కానీ ఎలా పెడితే మంచి ఫలితాలు వస్తాయని మాత్రం ఎవరూ ఆలోచించరు. జుట్టు ఎలా పడితే అలా నూనె పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలగవని నిపుణులు అంటున్నారు. 
 


వారానికి రెండుసార్లు తలస్నానం చేయడం, కండిషనింగ్, హెయిర్ ప్రొడక్ట్స్, హెయిర్ ఆయిల్ కేర్ మాస్క్ వంటివి మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయని నమ్ముతారు. కానీ జుట్టు ఆరోగ్యంగా, ఊడిపోకుండా ఉండాలంటే ఇవి చేస్తే సరిపోదు. ముఖ్యంగా జుట్టుకు నూనె పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీరు ఎన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడితే దండగేనంటారు నిపుణులు. అవును జుట్టుకు నూనె పెట్టామా? లేదా? అనేది కాకుండా.. ఎప్పుడు పెట్టాలి? ఎలా పెట్టాలో కూడా తెలుసుకోవాలి. మన జుట్టుకు నూనెను సరిగ్గా రాయకపోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యం బాగా ప్రభావితమవుతుందన్న ముచ్చట చాలా మందికి తెలియదు.

మీ జుట్టుకు నూనెను పెట్టడం జుట్టు సంరక్షణలో ఒక ముఖ్యమైన పని. ఇది మన జుట్టు కుదుళ్లకు మంచి పోషణను అందిస్తుంది. అలాగే జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. జుట్టుకు నూనె పెట్టడం ఎన్నో ఏండ్ల నుంచీ వస్తోంది. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సరిగ్గా పెట్టకపోవడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అసలు జుట్టుకు నూనె పెట్టేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


రాత్రిపూట నూనె పెట్టకూడదు

చాలా మందికి రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టుకునే అలవాటు ఉంటుంది. కానీ రాత్రిపూట జుట్టుకు నూనెను అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఇది జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల వెంట్రుకల రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే జుట్టుకు దుమ్ము, ధూళి మొదలైనవి అంటుకుంటాయి. దీనివల్ల జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు తెగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా జుట్టును వాష్ చేయడానికి 3 నుంచి 4 గంటల ముందే నూనె పెట్టండి. ముఖ్యంగా  జుట్టు మూలాలకు నూనె బాగా పెట్టండి. 
 

ఆయిలీ జుట్టుకు నూనె వద్దు 

ఆయిలీ జుట్టు కు దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు ఎక్కువగా అంటుకుంటాయి. ఆయిలీ జుట్టుకు నూనె పెట్టడం వల్ల జిడ్డు జుట్టులో సాధారణంగా కనిపించే రంధ్రాలు మరింత మూసుకుపోతాయి. ఆయిలీ జుట్టు ఉన్నవారు నూనె పెట్టడానికి బదులుగా  ముందు దీనికి చికిత్స తీసుకోవడం మంచిది. 

చుండ్రు ఉంటే..

చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. చుండ్రు ఉన్నవారు నూనెను పెట్టడం వల్ల నెత్తి మరింత డ్రైగా మారుతుంది. మీక చుండ్రు ఉంటే చుండ్రు కోసం తయారు చేసిన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడండి. వాటితో పాటుగా నెత్తిని హైడ్రేట్ చేసేందుకు ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్ లను కూడా ట్రై చేయండి. 
 

జుట్టు రాలిపోతున్నప్పుడు.. 

చాలా మంది జుట్టుకు నూనె పెడితే.. జుట్టు రాలదని నమ్ముతారు. అందుకే జుట్టు ఊడిపోయే వారు నూనును బాగా పెడుతుంటారు.కానీ ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు కుదుళ్లు పొడిబారి వెంట్రుకలు ఊడిపోతున్నట్టైతే.. మీరు నూనె పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇతర సందర్భాల్లో మాత్రం నిపుణులను సంప్రదించిన తర్వాతే నూనె పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
 

నూనె పెట్టిన తర్వాత దువ్వకూడదు

నూనె పెట్టిన తర్వాత జుట్టు సున్నితంగా మారుతుంది. ఇలాంటప్పుడు మీరు జుట్టును దువ్వితే వెంట్రుకలు తెగిపోతాయి. అందుకే నూనె పెట్టేకంటే ముందే జుట్టును దువ్వండి. అయితే జుట్టుకు నూనెను మరీ ఎక్కువగా పెట్టకూడదు. దీనివల్ల జుట్టు రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

టవల్ 

కొంతమంది జుట్టుకు నూనె పెట్టిన తర్వాత జుట్టు చుట్టూ టవల్ ను చుడుతుంటారు. కానీ జుట్టుకు టవల్ ను అస్సలు వాడకూడదు. కావాలంటే మీరు నూనెను గ్రహించడానికి సహాయపడటానికి కాటన్ టీ-షర్ట్ ను వాడొచ్చు. జుట్టుకు ఎలాంటి నష్టం చేయకుండా ఉంటుంది. నూనె పెట్టిన తర్వాత జుట్టును గట్టిగా ముడి వేయకూడదు. దీనివల్ల  ఫైబర్స్  దెబ్బతింటాయి. దీనివల్ల మీ జుట్టు బలహీనపడటం, రాలడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువ మసాజ్ కూడా చేయకూడదు.

Latest Videos

click me!