Hair care:మీ జుట్టు మీద మీకు ప్రేమ ఉంటే...ఇవి మాత్రం చేయకండి..!

First Published Aug 5, 2022, 3:12 PM IST

నిజంగా మీరు మీ జుట్టును ప్రేమిస్తున్నట్లయితే.. కొన్ని పనులు అస్సలు చేయకూడదట. మనం తెలియకుండా చేరసే కొన్ని పనులు మన జుట్టును పాడు చేసేస్తాయి. జుట్టు రాలిపోయేలా, నిర్జీవంగా మారేలా చేస్తాయి అవేంటో ఓసారి చూద్దాం...

జుట్టు అంటే ఇష్టం, ప్రేమ లేనివారు ఎవరైనా ఉంటారా..? ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఆ జుట్టును ఆరోగ్యంగా కాపాడుకునేందుకు చేయని ప్రయత్నమంటూ ఏదీ ఉండదు. అయితే.. నిజంగా మీరు మీ జుట్టును ప్రేమిస్తున్నట్లయితే.. కొన్ని పనులు అస్సలు చేయకూడదట. మనం తెలియకుండా చేరసే కొన్ని పనులు మన జుట్టును పాడు చేసేస్తాయి. జుట్టు రాలిపోయేలా, నిర్జీవంగా మారేలా చేస్తాయి అవేంటో ఓసారి చూద్దాం...
 

ఓవర్ వాష్ చేయవద్దు: తరచుగా షాంపూ చేయడం వల్ల మీ జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుంది. షాంపూలో ఉండే చాలా రసాయనాలు.. మన జుట్టులో ఉండే సహజ నూనెలను కోల్పోయేలా చేస్తాయి. దీని వల్ల జుట్టు పొడిబారడం, నిస్తేజంగా మారడం లాంటివి జరుగుతాయి. ఎక్కువగా షాంపూ చేయడం వల్ల జుట్టు మూలాల నుంచి బలహీనంగా మారతాయి. అంతేకాదు జుట్టు ఎక్కువగా రాలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి.. వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయడం ఉత్తమం. 

తలపై కండీషనర్ పెట్టవద్దు: షాంపూ చేసిన తర్వాత మీ జుట్టును కండిషన్ చేయడం చాలా ముఖ్యం కానీ సరిగ్గా ఎక్కడ పెట్టాలో మీరు తెలుసుకోవాలి. చాలా మంది కండిషనర్ ని కుదుళ్లకు రాస్తూ ఉంటారు. దాని వల్ల మీకే నష్టం జరుగుతుంది. కేవలం.. కింద వెంట్రుకలకు మాత్రమే కండిషనర్ వాడాల్సి ఉంటుంది. 
 

జుట్టును ఎక్కువ సేపు కట్టి ఉంచవద్దు: జుట్టును పోనీటైల్ లేదా ముడి వేసి  ఎక్కువసేపు ఉంచడం చాలా సౌకర్యంగా ఉంటుంది, ప్రత్యేకించి చాలా వేడిగా ఉన్నట్లయితే.. అందరూ జుట్టు ముడి వేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ  ఇది జుట్టుకు మంచిది కాదు. అలా ముడి పెట్టడం లేదంటే గట్టిగా బిగించి పోనీ టైల్ వేయడం వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారతాయి.  బదులుగా, మీ జుట్టును ఎప్పటికప్పుడు తెరిచి విశ్రాంతి ఇవ్వండి.


ఎక్కువసార్లు దువ్వడం.. చాలా మంది తమ జుట్టును ప్రతి గంట కోసారి దువ్వుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా దెబ్బ తింటూ ఉంటుంది. ఎక్కువగా జుట్టు దువ్వడం వల్ల.. జుట్టురాలిపోయే ప్రమాదం ఉంది. అలా అని అసలు దువ్వకపోయినా.. జుట్టు చిక్కులు పడి.. మరింత పాడయ్యే ప్రమాదం ఉంది. 
 


తడి వెంట్రుకలను దువ్వకండి: చాలా మంది చేసే పొరపాటు ఇది. తలస్నానం చేసిన వెంటనే.. తడి వెంట్రుకలను దువ్వుతూ ఉంటారు. తడి మీద జుట్టు దువ్వితే.. ఎక్కువగా రాలిపోతాయి. అంతేకాకుండా వెంట్రుకలు విరిగిపోతాయి.  జుట్టును కొంత సమయం పాటు సహజంగా ఆరనివ్వండి, ఆపై వెడల్పాటి దంతాల దువ్వెన తో దువ్వాలి. అప్పటి వరకు, మీ వేళ్లను ఉపయోగించండి.

స్టైలింగ్ లేదా హీట్ ప్రొడక్ట్‌లను ఎల్లవేళలా ఉపయోగించవద్దు: స్టైలింగ్‌ను ఇష్టపడే వ్యక్తులలో మీరు ఒకరైతే , మీ జుట్టుపై హీట్ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించడం ఎల్లప్పుడూ ఇష్టపడితే, దాని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. హీట్ టూల్స్ మీ జుట్టుకు అత్యంత శత్రువులు. మీరు స్ట్రెయిటెనింగ్ లేదా కర్లింగ్ చేయాలనుకుంటే, దానికి ముందు హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని ఉపయోగించండి. లేదంటే జుట్టు పాడైపోతుంది. తర్వాత మీరే బాధపడతారు.

click me!