పుదీనా ఆకులతో ఎన్ని ఇంటి పనులు చేయొచ్చో తెలుసా?

First Published May 22, 2024, 10:45 AM IST

సాధారణంగా కొత్తిమీరనైనా, పుదీనానైనా వంటల్లో వేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కానీ పుదీనా ఆకులను ఉపయోగించి మనం ఎన్నో ఇంటి పనులను కూడా చేయొచ్చు. 
 

mint leaves

పుదీనా మంచి వాసన ఉంటుంది. అలాగే టేస్ట్ గా కూడా ఉంటుంది. అందుకే మనం దీన్ని రకరకాల వంటల్లో వేస్తుంటాం. ముఖ్యంగా ఎండాకాలంలో పుదీనాను బాగా ఉపయోగిస్తుంటాం. ఎందుకంటే దీనిలో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది మండుతున్న ఎండలకు మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇంతేకాదు పుదీనా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అయితే ఆడవాళ్లు దీన్ని ఇంటి పనుల కోసం కూడా ఉపయోగించొచ్చు. అవును పుదీనాతో ఎన్నో ఇంటి పనులను కంప్లీట్ చేయొచ్చు. అవి ఏంటేంటంటే? 

దోమలు, ఈగలు రాకుండా.. 

ఎండాకాలంలో ఇంట్లో దోమలు, ఈగల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. వీటిని తరిమేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవి పోయినట్టే పోయి మళ్లీ ఇంట్లోనే ప్రత్యక్షమవుతాయి. అయితే మీరు ఇంట్లోని ఈగలు, దోమలను తరిమికొట్టడానికి పుదీనా ఆకులను కూడా ఉపయోగించొచ్చు. అవును వీటితో ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు. ఇందుకోసం పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించాలి. పుదీనా ఆకులను నీటిలో మరిగించిన తర్వాత చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని స్ప్రే బాటిల్ లో నింపి క్రిమిసంహారక మందుగా వాడండి.
 


డస్ట్ బిన్ క్లీన్ చేయడానికి..

వంటగదిలో ఉంచిన డస్ట్ బిన్ లో దుమ్ము వల్ల ఇంట్లోకి చిన్న చిన్న కీటకాల రావడం మొదలవుతుంది. దీని వల్ల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ కీటకాలను తరిమికొట్టడంలో పుదీనా చాలా ఎఫెక్టీవ్ గా ఉపయోగపడతాయి. ఇందుకోసం ముందుగా పుదీనా ఆకులను మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వడకట్టి అందులో వెనిగర్ లేదా బేకింగ్ సోడాను కలపాలి. ఈ మిశ్రమాన్ని డస్ట్ బిన్ పై స్ప్రే చేయండి. దీంతో డస్ట్ బిన్ కు అంటుకున్న కీటకాలన్నీ తొలగిపోతాయి. 

mint leaves

మొక్కలకు ప్రయోజనకరం 

వాతావరణం కారణంగా మొక్కలకు కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మొక్కలు సరిగ్గా ఉండవు. పూత, కాత కూడా సరిగ్గా ఉండదు. అయితే వీటిని మీరు రసాయన పురుగుమందు స్ప్రేకు బదులుగా సహజసిద్ధంగా ఇంట్లో తయారుచేసిన స్ప్రేతో వెళ్లగొట్టొచ్చు. ఇందుకోసం పుదీనా ఆకులను మిక్సీలో వేసి ఒక కప్పు నీళ్లు, బేకింగ్ సోడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిని జల్లెడలో వడగట్టి స్ప్రే బాటిల్ లో నింపి మొక్కలపై పిచికారీ చేయాలి.
 

mint leaves

బియ్యానికి పురుగు పట్టొద్దంటే? 

బియ్యం లేదా పప్పులను ఒకేసారి చాలా మొత్తంలో కొని ఇంట్లో నిల్వ చేస్తుంటారు. కానీ వీటిని చాలా కాలంగా వంటగదిలో ఉంచడం వల్ల పురుగులు పడతాయి. ఈ పురుగులను తొలగించడానికి పుదీనా ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

click me!