వాకింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ కరుగుతుందా..?

First Published May 22, 2024, 5:06 PM IST

సాధారణంగా నడవడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు.. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరంలో క్యాలరీలు బర్న్ చేయడంతో పాటు... మన మెటబాలిజం మెరుగవ్వడంలోనూ వాకింగ్ సహాయం చేస్తుంది.

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ మంది చేసే ప్రయత్నాల్లో వాకింగ్ ఒకటి. ఉదయం, సాయంత్రం, వారికి వీలు కుదిరినప్పుడల్లా వాకింగ్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. వాకింగ్  మంచిగా చేయడం వల్ల బరువు తగ్గుతారేమో కానీ... బెల్లీ ఫ్యాట్ కరుగుతుందా..? దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి తెలుసుకుందాం..
 

సాధారణంగా నడవడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు.. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరంలో క్యాలరీలు బర్న్ చేయడంతో పాటు... మన మెటబాలిజం మెరుగవ్వడంలోనూ వాకింగ్ సహాయం చేస్తుంది.

కానీ రోజూ వాకింగ్ చేస్తే.. బెల్లీ ఫ్యాట్ కరుగుతుందా లేదా అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న.  నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన 2014 అధ్యయనం ప్రకారం, ఊబకాయం ఉన్న మహిళలు వారానికి కనీసం మూడు సార్లు 12 వారాల పాటు 50 నుండి 70 నిమిషాలు నడవాలని సిఫార్సు చేశారు.  సగటున, ఆ మహిళలు బెల్లీ ఫ్యాట్ తో పాటు.. బాడీలో ఇతర ఫ్యాట్ కూడా కోల్పోయారట,

exercise

ప్రతిరోజూ కేవలం 30 నిమిషాల సాధారణ నడక బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుందట. అయినప్పటికీ, మీ ప్రస్తుత బరువు, శరీర కూర్పు, మొత్తం ఆహారం, జీవనశైలి వంటి అనేక అంశాలపై ఆధారపడి బెల్లీ ఫ్యాట్ కరగడం అనేది ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత ఎఫీషియంట్ గా  వాకింగ్ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. 
 

నడక అనేది వ్యాయామానికి  గొప్ప రూపం. కేలరీల లోటును సృష్టించడంలో సహాయపడుతుంది. అయితే.. వాకింగ్ చేయడం మొదలుపెట్టగానే బెల్లీ ఫ్యాట్ కరగదట. ముందుగా బరువు తగ్గి, శరీరంలోని ఇతర ప్రాంతాల్లో ఫ్యాట్ కరిగిన తర్వాత... దాని ప్రభావం బెల్లీ ఫ్యాట్ మీద చూపిస్తుందట. 
 

కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా... ఇతర వ్యాయామాలు చేయడం.. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం వల్ల కూడా.. మనం బెల్లీ ఫ్యాట్ ని సులభంగా కరిగించవచ్చు. ఇది మొత్తం మీ ఫిట్నెస్ కి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
 

జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్ లేదా డ్యాన్స్. ఈ కార్యకలాపాలు మీ హృదయ స్పందన రేటును పెంచుతాయి. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. బాడీ ఫ్యాట్ ని కూడా కరిగిస్తాయి.
 

walking

మీరు మీ బెల్లీ ఫ్యాట్ కరిగించాలి అంటే... ఆహారంలోనూ చాలా మార్పులు చేసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాలి. ప్రోటీన్, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడే మీకు ఫలితం లభిస్తుంది.

click me!