కూల్ డ్రింక్, టమాటా కెచప్ తో బాత్ రూం శుభ్రం.. ఎలా క్లీన్ చేయాలంటే?

First Published | May 31, 2024, 3:04 PM IST

బాత్ రూం ను అప్పుడప్పుడు క్లీన్ చేస్తుండాలి. లేదంటే బాత్ రూం లో మరకలు కావడంతో పాటుగా వాసన కూడా వస్తుంటుంది. అయితే బాత్ రూం ను క్లీన్ చేయడానికి ఇంట్లో ఉండే రెండు వస్తువులను ఉపయోగించొచ్చు. ఇవి మీ బాత్ రూం ను తెల్లగా చేస్తాయి. అవేంటంటే? 
 

బాత్ రూం ను క్లీన్ చేయడానికి మార్కెట్ లో చాలా ప్రొడక్ట్ లను కొంటుంటారు. వీటితో ప్రతి వారం క్లీన్ చేస్తుంటారు. బాత్ రూం ను క్లీన్ చేయడానికి చాలా మంది ఫ్లోర్ క్లీనర్ లేదా వాషింగ్ పౌడర్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇంట్లో ఉండే రెండు వస్తువులతో కూడా బాత్ రూం ను క్లీన్ చేయొచ్చు. ఇవి మీ బాత్ రూం ను తెల్లగా, మంచి వాసన వచ్చేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


కూల్ డ్రింక్, టమాటా కెచప్

అవును కూల్ డ్రింక్స్, టొమాటో కెచప్ లను ఉయోగించి మన బాత్ రూం ను క్లీన్ చేయొచ్చు. ఈ రెండు దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే బాత్ రూం ప్రతి మూలను ఇవి చాలా సులువుగా క్లీన్ చేస్తాయి. క్లీన్ చేయడంలో ఇవి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మరి వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 



కూల్ డ్రింక్ తో బాత్రూమ్ ను ఎలా శుభ్రం చేయాలి? 

ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ కూల్ డ్రింక్స్ ను తాగుతుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు కూల్ డ్రింక్ కొంచెం మిగిలిపోతుంటుంది. అయితే వీటిని ఓపెన్ చేసిన కొన్ని గంటలకు తాగాలనిపించదు. అయితే మీరు ఇలా మిగిలిపోయిన కూల్ డ్రింక్ ను బాత్ రూం ను క్లీన్ చేయడానికి ఉపయోగించొచ్చు. ఇందుకోసం బాత్రూంలో మరకలు పడిన ప్రదేశంలో కూల్ డ్రింక్ ను వేస్తే సరిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతాన్ని స్క్రబ్బర్ తో రుద్ది ఆ తర్వాత నీటితో కడిగేయాలి. అయితే కూల్ డ్రింక్స్ ను ఎక్కువ సేపు వదిలేయడం వల్ల ఆ ప్రదేశంలో రంగు మరకలు పడతాయి. అందుకే ఎక్కువ సేపు వీటిని వదిలేయకూడదు.
 

టమాటా కెచప్ తో బాత్ రూం ను ఎలా శుభ్రం చేయాలి?

బాత్ రూం కుళాయి లేదా సింక్ మొదలైనవి తరచుగా మురికిగా మారుతుంటాయి. అయితే వీటిని టమాటా కెచప్ తో కూడా ప్రకాశవంతంగా చేయొచ్చు. ఇందుకోసం కాటన్ లేదా బ్రష్ పై టమాటా కెచప్ ను అప్లై చేయండి. ఆ తర్వాత ఈ కెచప్ ను కుళాయి లేదా సింక్ మీద రుద్ది కొద్దిసేపు అలాగే ఉంచండి. ఆ తర్వాత తడి గుడ్డతో కుళాయిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ బాత్ రూం తలతల మెరిసిపోతుంది. 

Latest Videos

click me!