దుస్తులపై మరకలు ఎంతకీ పోవడం లేదా? ఇలా చేస్తే ఒక్క మరక కూడా ఉండదు

Published : May 31, 2024, 11:01 AM IST

దుస్తులపై మరకలు పడటం చాలా కామన్. అయితే చాలా మరకలు సబ్బుతో పూర్తిగా పోతాయి. కానీ కొన్ని మరకలు ఎన్ని సార్లు వాష్ చేసినా పోనేపోవు. ఈ మరకల వల్ల మనకు ఇష్టమైన దుస్తులను వేసుకోలేకపోతుంటాం. అయితే కొన్ని ఈజీ టిప్స్ తో దుస్తులకు అంటుకున్న మొండి మరకలను ఇట్టే పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.   

PREV
15
దుస్తులపై మరకలు ఎంతకీ పోవడం లేదా? ఇలా చేస్తే ఒక్క మరక కూడా ఉండదు

దుస్తులను ఉతకడానికి, శుభ్రంగా ఉతకడానికి చాలా తేడా ఉంది. ఒక్కోసారి కొన్ని దుస్తులను ఎంత రుద్దినా వాటికి అంటుకున్న మరకలు మాత్రం అస్సలు పోవు. ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ప్రతిరోజూ ఉంటుంది. కొన్నిసార్లు మధ్యాహ్న భోజనంలో సాస్, కొన్నిసార్లు పెన్ను సిరా మరకలు పడుతుంటాయి. పిల్లలు ఒక్కదగ్గర ఉండరు. ఏదో ఒక పనిచేసి మరకలను అంటించుకుంటూనే ఉంటారు. కానీ కొన్ని మరకలు అస్సలు పోవు. దీనివల్ల వాటిని మళ్లీ వసుకోవాలనిపించదు.  అయితే మీరు కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే ఎంతటి మొండి మరక అయినా ఇట్టే తొలగిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

25


బేకింగ్ సోడాలో నిమ్మరసం, వైట్ వెనిగర్, డిష్ సబ్బు, నీటిని కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి బట్టలపై ఉన్న మరకలపై స్ప్రే చేయండి. ఆ తర్వాత బ్రష్ తో రుద్దండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేయండి. ఇంకేముంది దుస్తులకు అంటుకున్న మొండి మరకలు సులభంగా మాయమవుతాయి. మరకలను పోగొట్టడానికి ఇది సురక్షితమైన, సహజమైన మార్గం. ఇంక్ మరకలను తొలగించడానికి, పాలలో వెనిగర్ జోడించి శుభ్రం చేయండి.
 

35
Hand Wash with Mild Detergent

బ్లౌజ్ లకు, టీ షర్ట్, షర్ట్ లకు చెమట మరకలు అంటుకోవడం చాలా సహజం. కానీ కొన్ని కొన్ని సార్లు ఈ చెమట మరకలు మొండిమరకలుగా మారిపోతాయి. వీటిని ఎంత ఉతికినా అస్సలు పోవు. అయితే ఈ చెమట మరకలను పోగొట్టడానికి డిటర్జెంట్ తో సగం నిమ్మకాయను రుద్దండి.

45


పీరియడ్స్ రక్తపు మరకలను తొలగించడానికి ఆ  గుడ్డను 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ లో నానబెట్టండి. ఆ తర్వాత బ్రష్ ను తీసుకుని రక్తపు మరకలను రుద్దండి. ఆ తర్వాత జనరల్ లాండ్రీలో వేయండి. రక్తపు మరకలను వెంటనే పోగొట్టాలంటే ఆ దుస్తులను వెంటనే గోరువెచ్చని నీటిలో వేయండి. ఈ నీరు మాత్రమే వాటిని పూర్తిగా తొలగిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ అందుబాటులో లేనప్పుడు సోడా లేదా కోలా వంటి వాటిని కూడా ఉపయోగించొచ్చు లేదా సాదా ఉప్పును రుద్దినా కూడా రక్తపు మరకలు పోతాయి. 
 

55

చొక్కా కాలర్ లు నల్లగా మారుతుంటాయి. ఇవి అంత తొందరగా శుభ్రం కావు. అయితే చొక్కా కాలర్ ను శుభ్రం చేయడానికి మీ రెగ్యులర్ షాంపూలో నానబెట్టండి. జిడ్డును, మురికిని వదిలించడానికి షాంపూ మరింత ప్రభావవంతంగా ఉంటుందని కొంతమంది నమ్ముతారు. ఎందుకంటే ఇది కాలర్ మరకలను, చెమట వాసనను కూడా తొలగిస్తుంది. దిండుపై నూనె మరకలు ఉన్నప్పుడు కూడా ఇదే పని చేయండి.
 

నూనె మరకలపై మొక్కజొన్న పిండిని వేయండి. ఇది నూనెను పూర్తిగా గ్రహించడానికి పనిచేస్తుంది. ఆ తర్వాత డిటర్జెంట్ తో సాధారణ లాండ్రీ చేయండి.

click me!

Recommended Stories