పట్టు చీరలను వాషింగ్ మెషిన్ లో ఉతకొచ్చా?

First Published | Oct 9, 2024, 4:54 PM IST

సిల్క్ చీరలను కూడా వాషింగ్ మెషిన్ లో ఉతకొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చీరలు పాడవుతాయి. అందుకే వాషింగ్ మెషిన్ లో సిల్క్ చీరలను ఎలా ఉతకాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆడవాళ్లకు పట్టుచీరలంటే చాలా ఇష్టం. ఏ పండగొచ్చినా ఆడవాళ్లు పక్కాగా పట్టు చీరలను కొంటారు. అయితే ఆడవాళ్లు పట్టుచీరలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా వీటికి ఏ మరకా అంటకుండా చూసుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో పట్టు చీరలకు మరకలు అంటుతుంటాయి. ఇది చాలా కామన్.

కానీ వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం. పట్టు చీరలు పాడవుతాయని ఆడవారు వాటిని వాషింగ్ మెషిన్ లో అస్సలు వేయరు. కానీ పట్టు చీరలను కూడా వాషింగ్ మెషిన్ లో ఉతకొచ్చు. 

పట్టు చీరలను మెషిన్‌లో ఉతకొచ్చా?

పట్టు చీరలను కూడా వాషింగ్ మెషిన్ లో ఉతకొచ్చు. కానీ మీరు కొన్ని చీరలను వాషింగ్ మెషిన్ లో ఉతకొచ్చో? లేదో? ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే చీరకున్న లేబుల్ ను ఖచ్చితంగా చదవండి. డ్రై క్లీన్ మాత్రమే చేయాలని ఉంటే.. దానిని వాషింగ్ మెషిన్‌లో ఉతకకూడదు. అయితే వాషింగ్ మెషిన్ లో ఉతికే పట్టుచీరలను వాషింగ్ మెషిన్ లో వేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

Latest Videos


 పట్టు చీరలను మెషిన్‌లో ఎలా ఉతకాలి?

నీటిలో నానబెట్టడం: వాషింగ్ మెషిన్ లో వేయడానికి ముందు పట్టు చీరలను చల్లనీ నీళ్లలో నానబెట్టండి. పట్టు చీరలకున్న దుర్వాసన, మరకలను పోగొట్టడానికి ఈ వాటర్ లో 1/4 కప్పు వెనిగర్‌ను వేయండి. 

మెషిన్ వాష్: పట్టు చీరలను ఒక లాండ్రీ బ్యాగ్‌లో ఉంచండి. ఈ బ్యాగ్ పట్టు చీరలకు ఏం కాకుండా చేస్తుంది.  లేదా దిండు కవర్‌ లో కూడా పట్టు చీరలను వేయొచ్చు. ఇకపోతే వాషింగ్ మెషిన్ సెట్టింగ్ చాలా ముఖ్యం. మీ వాషింగ్ మెషిన్‌లో డెలికేట్ సైకిల్‌ను ఎంచుకోవాలి. స్పిన్ తక్కువగా ఉండాలి. అలాగే నీటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. సైకిల్ పూర్తయిన వెంటనే పట్టు చీరలను దాంట్లో నుంచి తీయాలి. లేదంటే చీరలు మడతలు వస్తాయి. 

వాషింగ్ మెషిన్ లో ఉతికిన పట్టు చీరలను సహజ పద్దతిలోనే ఆరబెట్టాలి. ముఖ్యంగా పట్టు చీరలను డ్రైయర్‌లో అస్సలు ఉంచకూడదు. చీరలకున్న అదనపు నీటిని తొలగించడానికి టవల్ తో తుడవండి. అది కూడా రఫ్ గా కాదు. అలాగే పట్టు చీరలను నేరుగా ఎండలో వేయకూడదు. దీనివల్ల పట్టు చీరల రంగు మసకబారుతుంది. 

కాటన్ చీరలను ఉతకడం కంటే పట్టు చీరలను ఉతకడానికే ఎక్కువ శ్రద్ధ అవసరం. అయితే పట్టు చీరలను వాషింగ్ లో వేయొచ్చా? లేదా? అన్న డౌట్ ఉంటే వాటిని డ్రై క్లీన్ కు పంపండి.

వాషింగ్ మెషిన్ లో వేయాలనుకుంటే పట్టు చీరలను లాండ్రీ బ్యాగ్‌లో వేసి, డెలికేట్ సైకిల్‌ను ఎంచుకోండి. అలాగే దుస్తులను ఉతకడానికి చల్లని నీళ్లను మాత్రమే ఉపయోగించండి. ఉతికిన తర్వాత ఆరబెట్టండి.

click me!