పనికి రావని పారేయకండి.. ఉల్లిపాయ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో..

First Published | Nov 9, 2024, 2:26 PM IST

ప్రతిరోజూ మనం ఉల్లిపాయల్ని ఉపయోగిస్తాం. కానీ ఉల్లిపాయ తొక్కల్ని మాత్రం పనికిరానివిగా భావించి పారేస్తుంటాం. కానీ ఉల్లిపాయ తొకల్ని మనం ఎన్ని పనులకు ఉపయోగించొచ్చో తెలుసా? 

ఉల్లిపాయ లేని కూర అసలే ఉండదు. మనం ప్రతిరోజూ ఉల్లిపాయల్ని ఉపయోగిస్తాం. వీటి తొక్కల్ని డస్ట్ బిన్ లో వేసేస్తుంటాం. కానీ ఈ తొక్కలతో కూడా బోలెడు లాభాలు ఉన్నాయి తెలుసా? అవును వంటగదిని శుభ్రం చేయడం నుంచి మరకలను పోగొట్టడం వరకు ఇవి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. 

మీకు తెలుసా? ఉల్లిపాయ తొక్కలు నేచురల్ క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. అలాగే వీటిని ఉపయోగించి ఎన్నో రకాల మరకలను చాలా ఈజీగా తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఉల్లిపాయ తొక్కల్లో ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉండవు. కాబట్టి వీటితో మనకు ఎలాంటి హాని జరగదు. అందులోనూ ఇవి అందరి ఇంట్లో దొరుకుతాయి. 
 


ఉల్లిపాయ తొక్కల్ని గిన్నెలను మాత్రమే కాదు వంటింట్లోని ప్రతి మూలను శుభ్రం చేయడానికి ఉపయోగించొచ్చు. అందుకే ఈ సారి మీరు ఉల్లిపాయల్ని కట్ చేసినప్పుడు వాటి తొక్కలు పనికిరావని పారేయకుండా ఉపయోగించుకోండి. అసలు ఉల్లిపాయ తొక్కల్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గ్యాస్ గ్రీజును తొలగిస్తుంది

అవును ఉల్లిపాయ తొక్కల్ని ఉపయోగించి గ్యాస్ జిడ్డును చాలా సులువుగా తొలగించొచ్చు. ఇందుకోసం ఉల్లిపాయ తొక్కల్ని నీళ్లలో మరిగించి ఆ తర్వాత దాంట్లో డిష్ సబ్బును  మరకలపై పోసి క్లీన్ చేయండి. దీన్ని క్లీన్ చేయడానికి బ్రష్ లేదా మృదువైన బట్టను ఉపయోగించండి. 

డస్ట్ బిన్ ని శుభ్రం చేయడానికి

కిచెన్ డస్ట్ బిన్ లో రకరకాల వ్యర్థాలు ఉంటాయి. దీనివల్ల ఆ డస్ట్ బిన్ నుంచి మురికి వాసన వస్తుంటుంది. ఈ వాసన పోవడానికి ఉల్లిపాయ తొక్క నీళ్లు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ఉల్లిపాయ తొక్కలను 1 కప్పు గ్లాసు నీళ్లలో వేసి మరిగించండి. ఆ తర్వాత వాటిని చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ వాటర్ తో డస్ట్ బిన్ ను క్లీన్ చేయండి. 
 

ఐరన్ పాన్ మెరిసేలా చేస్తుంది

ఉల్లిపాయ తొక్క వంటగదిని శుభ్రం చేయడంతో పాటుగా కిచెన్ లో ఉన్న పాత్రలను కూడా క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇనుప పాన్ ను క్లీన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా తొక్కలను నిప్పులపై వేసి కాల్చండి. ఈ బూడిదలో డిటర్జెంట్ ను వేసి పాన్ ను క్లీన్ చేయండి. ఇది పాన్ ను తెల్లగా మెరిసేలా చేస్తుంది. 

Latest Videos

click me!