ఈ ఒక్క ఆయిల్ చాలు.. మీ వయసు పదేళ్లు తగ్గుతుంది..!

First Published | Nov 8, 2024, 3:30 PM IST

ఒకే ఒక్క ఆయిల్ మన ముఖాన్ని యవ్వనంగా మార్చడంతో పాటు.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుంది. మరి, ఆ నూనె ఏంటి..? ఎలా అప్లై చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం..

వయసు పెరుగుతున్నా కూడా అది మన ముఖంలో కనిపించకుండా యవ్వనంగా కనపడితే ఎంత బాగుంటుంది.. ఆ కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ.. వయసు కనిపించకుండా దాచలేం కదా అని  అనుకుంటూ ఉంటారు. అయితే.. ఒకే ఒక్క ఆయిల్ మన ముఖాన్ని యవ్వనంగా మార్చడంతో పాటు.. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుంది. మరి, ఆ నూనె ఏంటి..? ఎలా అప్లై చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం..

kumkumadi

మీ అందరికీ కుంకుమ పువ్వు తెలిసే ఉంటుంది. కుంకుమ పువ్వు చాలా మంది గర్భిణీలు పాల్లలో కలుపుకొని తాగుతూ ఉంటారు. ఈ కుంకుమ పువ్వు  అందుకు మాత్రమే కాదు.. సౌందర్య సాధనంగా కూడా వాడొచ్చని మీకు తెలుసా? మనకు కుంకుమాది తైలం లభిస్తుంది. ఈ కుంకుమాది తైలంతో అటు ముఖంలో యవ్వనాన్ని పెంచడమే కాకుండా…  జుట్టు ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఈ నూనె రాాయడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం..

Latest Videos


Kumkumadi Tailam

.ప్రకాశవంతమైన ముఖం..

కుంకుమాది తైలం ముఖానికి రాయడం వల్ల… మీ ముఖం మరింత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. మీ స్కిన్ కలర్ పెరగడమే కాకుండా.. పిగ్మెంటేషన్ ఉన్నా తగ్గిపోతుంది. 

2.వయసు తగ్గుతుంది..

కుంకుమాది తైలంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముఖంపై గీతలు, ముడతలు రాకుండా, వయసు పెరగకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. మీ చర్మం కాంతివంతంగా మారి కనపడుతుంది.

Image: Getty

మాయిశ్చరైజింగ్: నూనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.పోషణ చేస్తుంది. ఇది డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ వాళ్లకు కూడా బాగా సహాయపడుతుంది. చర్మాన్ని తేమగా ఉంచేలా చేస్తుంది. ఇది ముఖంపై మచ్చలు  తొలగించి, ముఖం అందంగా కనిపించేలా చేస్తుంది. అందేకాదు.. స్కిన్ రెడ్ నెస్, ర్యాషెస్ లాంటివి కూడా తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనె ముఖానికి రాసుకుంటే చాలు. ముఖం మెరిసిపోతుంది. 

Image: Getty

జుట్టుకు ప్రయోజనాలు:

కుంమాది తైలాన్ని జుట్టుకు రాయడం వల్ల.. జుట్టు సరైన పోషణ అందిస్తుంది. కుదుళ్లను బలపరుస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరగుదలకు కూడా సహాయపడుతుంది. ఈ నూనె రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య అనేది ఉండదు. అంతేనా.. జుట్టు మెరుస్తూ.. స్మూత్ గా కూడా కనిపిస్తుంది. రెగ్యులర్ గా ఈ నూనె రాయడం వల్ల జుట్టు సహజంగా మెరుస్తూ కనపడుతుంది. జుట్టుకు మంచి కండిషనింగ్ ఇస్తుంది. ఇక నూనె తలస్నానానికి ఒక గంట ముందు రాసుకోవచ్చు. రోజూ రాసుకున్నా పర్వేలేదు. మంచి ఫలితాన్ని అందిస్తుంది.

click me!