ఆలివ్ ఆయిల్ తలకు ఇలా రాస్తే... మీ జుట్టునడుము వరకు పెరగడం ఖాయం..!

First Published | Aug 8, 2024, 12:55 PM IST

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. దీనిలో.. మన జుట్టుకు కావాల్సిన ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. జుట్టు సమస్యలను పూర్తిగా తగ్గించేస్తాయి.

పొడవాటి జుట్టును కోరుకోనివారు ఎవరు ఉంటారు..? ముఖ్యంగా అమ్మాయిలు.. తమ జుట్టు నడుము వరకు ఉండాలని అనుకుంటారు. దానికోసం.. ఏవేవో ఆయిల్స్ తలకు రాసేస్తూ ఉంటారు. వాటి వల్ల ఉపయోగం అందరికీ ఉండకపోవచ్చు. కానీ... ఇప్పుడు మేం చెప్పే హోం రెమిడీ మాత్రం.. మీకు ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నా తగ్గిపోయి, జుట్టు ఒత్తుగా, నడుము వరకు పెరుగుతుంది. మరి దానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

సాధారణంగా అందరూ తలకు కొబ్బరి నూనె రాస్తారు. కానీ.. కొబ్బరి నూనె కు బదులు మనం ఆలివ్ ఆయిల్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే.. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. దీనిలో.. మన జుట్టుకు కావాల్సిన ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. జుట్టు సమస్యలను పూర్తిగా తగ్గించేస్తాయి. అయితే... నార్మల్ కాకుండా.. ఈ నూనెలో మరికొన్ని జత చేసి మరీ తలకు రాస్తే.. అప్పుడు ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి.
 


మీరు ఆలివ్ ఆయిల్ లో.. విటమిన్ ఈ క్యాప్సిల్ లోని ఆయిల్ ని  కలిపి జసుట్టుకు అప్లై చేయాలి. ఈ రెండూ కలిపి రాయడం వల్ల  జుట్టు చాలా వేగంగా పెరగడానకి సహాయపడుతుంది.

అదే ఆలివ్ ఆయిల్ లో... కోడిగుడ్డు కలపాలి.  కోడిగుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.  ఈ రెండూ కలిపి రాయడం వల్ల.. జుట్టు వేగంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. 
 

ఒక కోడిగుడ్డులోని వైట్ ని తీసుకొని అందులో... రెండు టేబుల్ స్పూన్ ల ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఆ రెండింటి మిశ్రమాన్ని.. హెయిర్ మాస్క్ లాగావేయాలి. అరగంట తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది.

ఆలివ్ ఆయిల్ లో.. అరటి పండు కలిపి తలకు హెయిర్ మాస్క్ వేయడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ రెండూ కలిపి రాయడం వల్ల.. జుట్టుకు సహజంగా కండిషనింగ్ అందిస్తుంది. ఈ రెండింటినీ కలిపి మెత్తని పేస్టులాగా చేసుకొని.. జుట్టు కుదుళ్లకు బాగా అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత  హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది.

ఆలివ్ ఆయిల్ లో కలబంద గుజ్జు కలిపి జుట్టు కు రాయడం వల్ల కూడా.. జుట్టుకు బాగా ప్రయోజనం ఉంటుంది. అరగంట తర్వాత జుట్టు కడుక్కోవాలి. వారానికి కనీసం మూడు సార్లు అయినా దీనిని అప్లై చేయాలి.
 

Latest Videos

click me!