ఒలంపిక్స్ లో పథకాలు సాధించిన భారతీయ మహిళలు ఏవరెవరంటే?

First Published | Aug 7, 2024, 11:49 AM IST

ఎంకరేజ్ చేసే వాళ్లు ఉండాలేగానీ ఆడవాళ్లు ఒక గొప్ప స్థాయికి ఎదిగి ఎందరికో ఆదర్శమవుతారు. ఇక పురుషులే ఎక్కువగా పాల్గొనే క్రీడా ప్రపంచంలో ఆడవాళ్లు తమకు పోటీ ఎవరూ లేరని నిరూపిస్తున్నారు. 
 

కొన్నేండ్ల నుంచి  ఇండియా ఒలింపిక్స్ లో గొప్ప గొప్ప విజయాలను సాధిస్తూ వస్తోంది. ముఖ్యంగా భారతీయ మహిళా అథ్లెట్లు అయితే  తమకు పోటీ ఎవరూ లేరన్నట్టుగా దూసుకుపోతున్నారు. వీళ్ల విషయం దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది.  మీకు తెలుసా? భారత అథ్లెట్లు 2023 వరకు 24 ఒలింపిక్ క్రీడల్లో 35 పతకాలు సాధించారు. వీటిలో ఏడుగురు మహిళా అథ్లెట్లు ఎనిమిది పతకాలను సాధించారు. మరి భారతీయ మహిళలు ఎవరెవరు ఏయే పథకాలను సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కరణం మల్లీశ్వరి

కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టర్. ఈమె ఒలింపిక్స్ లో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. 2000 సిడ్నీ గేమ్స్ లో కరణం మల్లేశ్వరి స్నాచ్ లో 110 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో 130 కేజీలు, మొత్తం 240 కేజీలు ఎత్తి కాంస్య పతకం సాధించారు. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత వెయిట్ లిఫ్టర్ ఈమె. 
 

Latest Videos


Image credit: PTI


సైనా నెహ్వాల్..

2012 లండన్ ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ లో  సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించించి భారత బ్యాడ్మింటన్ ను ప్రపంచ పటంలో నిలిపింది. ఈమె తన ప్రత్యర్థి అయినా చైనాకు చెందిన వాంగ్ జిన్ గాయం వల్ల వైదొలగడంతో పతకం సాధించింది. అంతకు ముందు సెమీఫైనల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి 13–21, 13–21తో టాప్ సీడ్ వాంగ్ యిహాన్ చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది సైనా నెహ్వాల్. ఈమె మూడు సమ్మర్ గేమ్స్ అయిన బీజింగ్ 2008, లండన్ 2012, రియో 2016 దేశాలకు ప్రాతినిధ్యం వహించింది.
 

మేరీ కోమ్..

స్టార్ బాక్సర్ మేరీకోమ్ కూడా ఒలంపిక్ పథకాన్ని సాధించింది. ఈమె 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చింది. మొదటి రెండు రౌండ్లలో పోలాండ్ కు చెందిన కరోలినా మిచల్జుక్, ట్యునీషియాకు చెందిన మరోవా రహాలీలను ఓడించింది. తర్వాత మణిపురి క్రీడాకారిణి సెమీ ఫైనల్లో యూకేకు చెందిన నికోలా ఆడమ్స్ చేతిలో ఓడిపోయి కాంస్య పతకం సాధించింది. 
2008 బీజింగ్ లో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించిన తర్వాత బాక్సింగ్ లో భారత మహిళకు ఇది తొలి ఒలింపిక్ పతకం కావడం విశేషం.
 

పీవీ సింధు..

2012 లండన్ లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది. ఆ తర్వాత పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ కు చేరుకుని భారత బ్యాడ్మింటన్ ను మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. ఈ మె ఫైనల్లో.. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. అయినా పీవీ సింధు 83 నిమిషాల పాటు పోరాడి రజత పతకం సాధించింది. పీవీ సిందు రన్నరప్ గా నిలిచినప్పటికీ భారతదేశానికి అతి పిన్న వయస్కుడైన వ్యక్తిగత ఒలింపిక్ పతక విజేతగా మాత్రం చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా పీవీ సింధు రికార్డు సృష్టించింది.
 

సాక్షి మాలిక్..

రియో ఒలింపిక్స్ లో మహిళల 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించింది. అంతకుముందు రౌండ్లలో విజయం సాధించినా సాక్షి మాలిక్ క్వార్టర్ ఫైనల్లో రష్యాకు చెందిన వలేరియా కొబ్లోవా చేతిలో ఓడిపోయింది. కాగా కొబ్లోవా ఫైనల్ కు చేరడంతో సాక్షి మాలిక్ 8–5తో కిర్గిజిస్తాన్ పై విజయం సాధించి కాంస్య పతకం సాధించింది. 
 


మీరాబాయి చాను..

టోక్యో ఒలింపిక్స్ 2020లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. మణిపూర్ కు చెందిన మీరాబాయి చాను ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారత వెయిట్ లిఫ్టర్ గా రికార్డు క్రియేట్ చేసింది.  కరణం మల్లీశ్వరి తర్వాత సమ్మర్ గేమ్స్ లో పతకం సాధించిన రెండో భారతీయ వెయిట్ లిఫ్టర్ గా, పీవీ సింధు తర్వాత ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన రెండో భారతీయ మహిళగా మీరాబాయి చాను పేరు నిలిచింది.

లవ్లీనా బోర్గోహైన్.. 

అస్సామీ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ టోక్యో 2020 లో కాంస్య పతకం సాధించింది. రౌండ్ ఆఫ్ 16లో లవ్లీనా బోర్గోహైన్ జర్మనీకి చెందిన నాడిన్ అపెట్జ్ ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్ లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్ నీన్ చిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది. 
 

పీవీ సింధు.. 

 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం సాధించి రికార్డు క్రియేట్ చేసింది. గ్రూప్ దశలు, తొలి నాకౌట్ రౌండ్లలో దూసుకెళ్లిన పీవీ సింధు సెమీఫైనల్లో 18–21, 12–21తో రెండో సీడ్ తై జు యింగ్ చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ప్లేఆఫ్లో ఎనిమిదో సీడ్ హీ బింగ్జియావో చైనా ను ఓడించి కాంస్య పతకం సాధించింది.

ఈ విజయంతో రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా దేశం నుంచి రెండో అథ్లెట్ గా పీవీ సింధు రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా, నాలుగో క్రీడాకారిణిగా చరిత్రలో తన పేరును నిలుపుకుంది. 
 


పారిస్ ఒలంపిక్స్ 2024

మను భాకర్

మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. మను భాకర్ భారతదేశం మొదటి మహిళా ఒలింపిక్ షూటింగ్ పతక విజేతగా నిలిచింది. మను భాకర్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్‌గా చరిత్ర సృష్టించింది. గతంలో రియో ​​2016, టోక్యో 2020 ఒలింపిక్స్‌లో పతకాలు పొందలేకపోయిన భారత షూటింగ్‌లో మను భాకర్ విజయం సాధించి దేశానికి గొప్ప పేరు తీసుకొచ్చింది. 
 

వినేష్ పోగట్

ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ నిలిచారు. ఈమె  ఇప్పటికే జపాన్ ప్రపంచ నంబర్ వన్, ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్ యుయి సుసాకికి  అంతర్జాతీయ కెరీర్ లో తొలి ఓటమిని మిగిల్చింది. ఆ తర్వాత 2018 యూరోపియన్ చాంపియన్ ఓక్సానా లివాచ్ (ఉక్రెయిన్)ను ఓడించి క్యూబాకు చెందిన యుస్నేలిస్ గుజ్మన్ లోపెజ్పై విజయం సాధించింది.

click me!