ఓట్స్ తినడం కాదు.. ఇలా చేస్తే.. మీ అందం రెట్టింపు..!

First Published Jun 20, 2024, 4:40 PM IST

 ఓట్స్ లో ప్రోటీన, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని యవ్వనంగా కనిపించడంలో సహాయం చేస్తాయి. అంతేకాదు.. చర్మాన్ని.. మాయిశ్చరైజ్డ్ గా కూడా ఉంచుతాయి.
 

బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది తమ డైట్ లో ఓట్స్ ని  భాగం చేసుకుంటూ ఉంటారు.  కానీ... ఓట్స్ తో ఆరోగ్యం మాత్రమే కాదు...  మన అందాన్ని పెంచడంలోనూ సహాయం చేస్తుంది.  మనం మన స్కిన్ రొటీన్ లో... ఈ ఓట్స్ ని భాగం చేసుకుంటే..  చర్మం మెరిసిపోవడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే... ఓట్స్ లో ప్రోటీన, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని యవ్వనంగా కనిపించడంలో సహాయం చేస్తాయి. అంతేకాదు.. చర్మాన్ని.. మాయిశ్చరైజ్డ్ గా కూడా ఉంచుతాయి.

అయితే... ఈ ఓట్స్ ని ఎలా మన స్కిన్ కి వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Latest Videos


ఓట్ మీల్ తో బాత్ రొటీన్..
బాత్ రొటీన్ లో... ఓట్ మీల్ ని యాడ్ చేయాలి. ముందుగా కొన్ని ఓట్స్ తీసుకొని.. అందులో కొద్దిగా వేడి నీరు పోయాలి. అందులో కొంచెం బేకింగ్ సోడా వేయాలి. కావాలంటే దీనిలో పాలు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు.. చర్మానికి అప్లై చేయాలి. మంచిగా స్క్రబ్ చేసి..15 నిమిషాల తర్వాత.. తలస్నానం చేస్తే సరిపోతుంది. చర్మం చాలా స్మూత్ గా మారుతుంది.
 

ఓట్ మాస్క్..
ఓట్స్ తో ఫేస్ మాస్క్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది  చర్మాన్ని చాలా గ్లోయిగా మారుస్తుంది. దాని కోసం.. ఒక పప్పు పాలు తీసుకొని.. అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేయాలి. అందులో రెండు కప్పుల ఓట్స్ వేయాలి. దానిని మంచి పేస్టులాగా కలుపుకొని ఫేస్ కి మాస్క్ లాగా అప్లై చేయాలి. 20 నిమిషాలపాటు అలానే ఉంచి.. తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల  చర్మం యవ్వనంగా.. మెరుస్తూ కనపడుతుంది.

క్లెన్సర్ గా  ఓట్స్..
మీకు ఆయిల్ ఫేస్  అయితే... కూడా ఓట్స్ ని అప్లై చేయవ్చు. ముందుగా... ఒక ముప్పావు కప్పు నీరు తీసుకొని.. దానిని బాగా మరిగించాలి. తర్వాత అందులో ఓట్స్ వేసి.. చల్లారనివ్వాలి. తర్వాత దానిని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత... ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మంచి క్లెన్సర్ లా పని చేస్తుంది. ముఖంపై జిడ్డు కూడా పోతుంది.
 

click me!