కొంతమందికి పీరియడ్స్ టైంలో భరించలేని కడుపు నొప్పి, వికారం, నడుము, కాళ్లు లాగడంతో పాటుగా తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వీటివల్లే ఆడవారికి ఆ నాలుగైదు రోజులు వేరే ఏ విషయాలను పెద్దగా పట్టించుకోరు. అయితే పీరియడ్స్ సమయంలో రక్తపు మరకలు అంటకూడదని చాలా మంది ఆడవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వాళ్లకు తెలియకుండానే ఎప్పుడో ఒకసారి మరకలు అంటుకుంటూనే ఉంటాయి. ఇది చాలా కామన్.
కానీ పీరియడ్స్ లో రక్తపు మరకలు అంటితే అవి అంత సులువుగా పోవు. అలాగే వాటి నుంచి వింతైన చెడు వాసన కూడా వస్తుంది. బట్టలపై ఉన్న పీరియడ్స్ రక్తపు మరకలను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే తడి రక్తపు మరకలను నీటిలో నానబెడితే సులువుగా పోతాయి. కానీ ఆరిన రక్తపు మరకలు మాత్రం పోవు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఆరిన రక్తపు మరకలను ఈజీగా పోగొట్టొచ్చు.
నెలలో 4 నుంచి 5 రోజులు ప్రతి మహిళకు బాధాకరంగా ఉంటాయి. పీరియడ్స్ సమయంలో బట్టల మీద రక్తం రావడం సర్వసాధారణం. కానీ వీటిని వాష్ చేసినా మరకలు మాత్రం అలాగే కనిపిస్తాయి. బెడ్ షీట్ లేదా కొన్నిసార్లు ప్యాంట్ అడుగు భాగంలో ఉండే రక్తపు మరకలు చూడలేకపోవడం వల్ల ఎండిపోతాయి. ఇలాంటి మరకలను ఎలా పోగొట్టాలంటే?
కావాల్సిన పదార్థాలు
ఉప్పు
కూల్ వాటర్
గుడ్డ
డిటర్జెంట్
గోరువెచ్చని నీరు
మరకను ఎలా శుభ్రం చేయాలి?
బట్టలపై డ్రై పీరియడ్ మరకలను శుభ్రం చేయడానికి వంటగదిలో ఉంచిన ఉప్పును ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముందుగా.. రక్తపటు మరక 1 నుంచి 2 వారాల వారకు అలాగే ఉంటే ఆ మరకను పోగొట్టడానికి మీరు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. పీరియడ్స్ రక్తపు మరకను శుభ్రం చేయడానికి మొదటగా ఆ డ్రెస్ ను నీటితో తడపండి. తడిపిన తర్వాత మరకపై ఉప్పును వేయండి. ఇప్పుడు ఆ డ్రెస్ ను 05 నుంచి 07 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత చేతులతో లేదా బ్రష్ తో రుద్ది శుభ్రం చేయండి. అయితే నైలాన్ వంటి వస్త్రాలపై ఉప్పును వాడకూడదు. ఈ దుస్తులకు ఉప్పును నీటిలో కలిపి వాడాలి.