ఇవి పెడితే.. మీ ముఖం బంగారంలా మెరిసిపోతుంది

First Published | Aug 4, 2024, 3:35 PM IST

తేనె కేవలం తినడానికి మాత్రమే కాదు.. ఇది మనకు ఎన్నో విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి మీరు మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా, మచ్చలు, మొటిమలు లేకుండా చేయొచ్చు. అందుకే తేనెను ముఖానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Image: Getty

ప్రతి మహిళ తన ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటుంది. కానీ పెరుగుతున్నకాలుష్యం, ఆయిలీ ఫుడ్, చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ముఖంపై మొటిమలు, డ్రై స్కిన్,  మచ్చలు వంటి సమస్యలువ స్తాయి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారికి తేనె ఖచ్చితంగా సహాయపడుతుంది. అవును తేనె మీ ముఖాన్ని తిరిగి అందంగా, ప్రకాశవంతం చేయడానికి బాగా సహాయపడుతుంది. తేనెలో ఉండే ఎన్నో లక్షణాలు మన ముఖానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి తేనె ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలి? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Image: Getty Images

తేనె, నిమ్మరసం

తేనె, నిమ్మరసంతో చేసిన ఫేస్ ప్యాక్ ముఖాన్ని అందంగా మార్చుతుంది. ఈ ఫేస్ మాస్క్ ను తయారుచేయాలనికి ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో ఒక టీ స్పూన్ తేనెను వేయండి. దీనిలో అర టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.  ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
 

Latest Videos



తేనె, ఓట్ మీల్

తేనె, ఓట్ మీల్ తో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ ప్యాక్ ను తయారుచేయడానికి ఓట్స్ ను తీసుకుని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఆ నీటిని వడగట్టి ఒక గిన్నెలో వేసి అందులో చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై  చేయండి. ఇది ఆరిన తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖానికి గ్లోను ఇస్తుంది. 
 

తేనె, పెరుగు

తేనె, పెరుగుతో తయారుచేసిన మాస్క్ ను ఉపయోగించినా మీ ముఖం అందంగా మారుతుంది. ఈ ఫేస్ మాస్క్ ను తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకుని అందులో తేనె వేయండి. దీనిలో పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ మాస్క్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
 

తేనె,  పసుపు

తేనెలో పసుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల మీ ముఖంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ మాస్క్ చర్మకాంతిని పెంచుతుంది. అలాగే ముఖంపై ఉన్న మచ్చలు, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది.
 

తేనె, అరటి

తేనె, అరటిపండు కాంబినేషన్ ఫేస్ మాస్క్ కూడా మీ ముఖానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తయారుచేయడానికి అరటిపండును బాగా మెత్తగా రుబ్బి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
 

తేనె, కలబంద జెల్

తేనె, కలబంద జెల్ రెండూ మన ముఖానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి తేనె,  అలోవెరా జెల్ ను సమాన పరిమాణంలో తీసుకొని బాగా మిక్స్ చేయండి. దీనని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

click me!