Black Neck
అందమైన, మెరిసే చర్మాన్ని పొందాలని అందరూ కోరుకుంటారు. దాని కోసం.. మనం ఎన్నో రకాల క్రీములు వాడుతూ ఉంటారు. కానీ.. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కోసారి.. సూర్య రశ్మి ఎక్కువగా తగలడం వల్ల మన చర్మం పై ట్యాన్ పేరుకుపోతుంది. ముఖ్యంగా మెడ భాగం నల్లగా మారుతుంది. అయితే.. ఒక్కసారి మెడ నల్లగా మారిపోయింది అంటే.. మనం ఎన్ని రకాల క్రీములు వాడినా.. పెద్దగా ఫలితం వెంటనే కనిపించదు. కానీ... కొన్ని రకాల హోం రెమిడీస్ పాటించడం వల్ల.. సులభంగా ఈ సమస్య నుంచి మనం బయటపడొచ్చట.
మన కిచెన్ లో లభించే కొన్ని వస్తువులతోనే మెడ నలుపును ఈజీగా తొలగించవచ్చట. అయితే.. కిచెన్ లో దొరికే ఏ వస్తువులతో మనం ఈ మెడ నలుపును పోగొట్టుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం....
అటువంటి పరిస్థితిలో, నల్లటి మెడను శుభ్రం చేయడానికి మీరు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులను ప్రయత్నించవచ్చు. కాబట్టి డార్క్ నెక్ ను క్లీన్ చేయడానికి ఏయే వస్తువులను ఉపయోగించవచ్చో తెలుసుకుందాం. అలాగే, ఈ వస్తువుల వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మేము మీకు చెప్తాము?
1.నిమ్మకాయ.. ప్రతి ఒక్కరి ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది. ఈ నిమ్మకాయను ఉపయోగించి మనం.. మెడపై నలుపును తొలగించవచ్చట. దీని కోసం.. ముందుగా.. నిమ్మకాయ,శెనగపిండి ఈ రెండూ కలిపి మెడపై రాసి.. రుద్దాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.... కచ్చితంగా మెడపై నలుపును పోగొట్టవచ్చు. కనీసం వారానికి మూడు సార్లు అయినా దీనిని మీ మెడపై అప్లై చేయాలి. అప్పుడు మాత్రమే మీకు పరిష్కారం లభిస్తుంది.
black neck in women
శనగపిండిలో ఉండే గుణాలు చర్మంపై టానింగ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంలో శెనగపిండి చాలా సహాయపడుతుంది.
ముఖంపై రంధ్రాలను లోతుగా శుభ్రపరచడానికి శనగ పిండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Black Neck
ఇక..నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
ఇది చర్మం నల్లబడడాన్ని క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మంపై నల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.