ఇదొక్కటి పెడితే.. మీ వెంట్రుకలు అస్సలు ఊడవు..

First Published | Aug 4, 2024, 12:41 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మందికి హెయిర్ ఫాల్ సమస్య ఉంది. హెయిర్ ఫాల్ తగ్గాలని నూనెలను, షాంపూలను వాడుతూనే ఉంటారు. కానీ వీటివల్ల మీ జుట్టు రాలడం ఆగుతుందని చెప్పలేం. కానీ ఒక దానితో మీరు హెయిర్ ఫాల్ కాకుండా చేయొచ్చు. అదేంటంటే? 

మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకమైన జుట్టుకు సంబంధించిన సమస్య ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్. జుట్టు రాలడం వల్ల నెత్తి పల్చగా మారుతుంది. సన్నగా అవుతుంది. ఇంకేముందు నూనెలు, షాంపూలే కారణమని వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు. కానీ ఇవి మీ జుట్టు మరింత రాలేలా చేస్తాయి. జుట్టు రాలకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటుగా కొన్ని హోం రెమెడీస్ ను కూడా అవలంబించాల్సి ఉంటుంది. ముఖ్యంగా  హజల్ నట్స్ జుట్టును రాలకుండా చేయడానికి బాగా సహాయపడుతుంది. 
 

హాజల్ నట్స్ లో విటమిన్ ఇ, విటమిన్ బి లతో పాటుగా మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి నెత్తిమీద, జుట్టు కుదుళ్లకు పోషణను ఇస్తాయి. అంతేకాదు దీనిలో ఉండే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును మాయిశ్చరైజ్ చేయడంతో పాటుగా కుదుళ్లను బలంగా చేస్తాయి. ఇది జుట్టు తెగిపోవడాన్ని, రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే హాజెల్ నట్స్ లో ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి హెయిర్ షాఫ్ట్ ను బలోపేతం చేయడానికి, వెంట్రుకలు రాలకుండా చేయడానికి సహాయపడతాయి. అందుకే జుట్టు రాలకుండా ఉండటానికి హజల్ నట్స్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


hazelnut

హాజెల్ నట్, గుడ్డుతో హెయిర్ మాస్క్ 

హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవడానికి హాజెల్ నట్స్, గుడ్లతో హెయిర్ మాస్క్ లను తయారు చేయండి. గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టును బలంగా చేస్తుంది. హాజెల్ నట్ ఆయిల్ నెత్తిమీద పోషణను అందిస్తుంది. అలాగే జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది.  ఇందుకోసం హెయిర్ మాస్క్ తయారు చేయడానికి.. గుడ్డును ఒక గిన్నెలో బాగా కలిసే వరకు గిలకొట్టండి. దీనిలో హాజెల్ నట్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు అప్లై చేయండి. దీన్ని మీ నెత్తికి అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయండి.
 

హాజెల్ నట్ ఆయిల్, అవొకాడో హెయిర్ మాస్క్ 

అవొకాడోలో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణను, తేమను అందిస్తాయి. హాజెల్ నట్ ఆయిల్ జుట్టును బలోపేతం చేస్తుంది. గ్లో గా చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల హాజెల్ నట్ ఆయిల్ లో బాగా పండిన ఒక అవొకాడో పేస్టును వేయండి. ఈ హెయిర్ మాస్క్ ను మీ నెత్తికి, జుట్టుకు బాగా పట్టించండి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయండి.
 

హాజెల్ నట్ ఆయిల్, కలబంద హెయిర్ మాస్క్ 

కలబంద జెల్ మీ నెత్తికి మంచి ఓదార్పు అనుభూతిని ఇవ్వడంతో పాటుగా జుట్టు బాగా పెరిగేందుకు కూడా  సహాయపడుతుంది. హాజెల్ నట్ ఆయిల్ జుట్టుకు పోషణ అందిస్తుంది. కుదుళ్లను బలోపేతం చేస్తుంది.  2 టేబుల్ స్పూన్ల హాజెల్ నట్ ఆయిల్ లో,  2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ వేసి బాగా కలపండి.  ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా అప్లై చేయండి. సున్నితంగా మసాజ్ చేసి 30 నిమిషాల నుంచి గంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీరు, షాంపూతో తలస్నానం చేయండి.

Latest Videos

click me!