మందార పువ్వులను ఇలా వాడితే.. మీ జుట్టు అస్సలు ఊడిపోదు.. పొడుగ్గా పెరుగుతుంది

First Published | Sep 6, 2024, 10:23 AM IST

మందార పవ్వులు కూడా మన జుట్టుకు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. వీటిని వాడితే ఎన్నో జుట్టు సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి, జుట్టు పొడుగ్గా పెరగడానికి బాగా సహాయపడుతుంది. 

చాలా మంది ఆడవారికి తమ జుట్టు పొడుగ్గా, మందంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ నేటి జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో  హెయిర్ ఫాల్ ఒకటి.  దీనిని మొదట్లోనే తగ్గించుకోకపోతే ఈ సమస్య మరింత పెరిగి జుట్టు పల్చగా అవుతుంది. 

అయితే హెయిర్ ఫాల్ సమస్యకు మందార పువ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. అవును మందార పువ్వును ఉపయోగించి కూడా మీరు వెంట్రుకలు ఊడిపోకుండా చేయొచ్చు. అలాగే మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా, తెల్లవెంట్రుకలు రాకుండా చేయొచ్చు. ఇందుకోసం మందార పువ్వును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

hibiscus

మందార పువ్వులు

మందార పువ్వుల్లో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, యాంటీ మైక్రోబియల్ న్యూట్రిషన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మందార పువ్వులను ఒక పద్దతిలో ఉపయోగిస్తే మన జుట్టు ఆరోగ్యంగా, ఊడిపోకుండా ఉంటుంది. 
 


ఎలా ఉపయోగించాలి?

జుట్టుకు మందార పువ్వలును ఉపయోగించడానికి..ముందుగా 12 నుంచి 15 మందార పువ్వులను తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయండి.

జుట్టుకు మందార ప్యాక్ ను 30 నుంచి 40 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా మందార పువ్వుల పేస్ట్ ను పెట్టడం వల్ల మీ జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. 

కొబ్బరినూనెలో మందార పువ్వలును కలపాలి

కావాలనుకుంటే మీరు మందార పువ్వులతో నూనెను తయారుచేసి కూడా వాడొచ్చు. ఇందుకోసం ఒకటి నుంచి రెండు కప్పుల కొబ్బరినూనెను తీసుకోండి. దీంట్లో మందార పువ్వులు వేసి కాసేపు మరగబెట్టండి. కొబ్బరి నూనె రంగు మారినవెంటనే స్టవ్ ను ఆఫ్ చేయండి. 
 

మందార నూనెను పెట్టడం వల్ల లాభాలు

బలమైన జుట్టు: మందార పువ్వులను మరిగించిన కొబ్బరి నూనెను రెగ్యలర్ గా పెట్టడం వల్ల మీ జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకోండి. ఈ నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు మూలాల నుంచి  బలంగా మారుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా  చాలా వరకు తగ్గుతుంది.

పొడవాటి మందపాటి జుట్టు: మందారం పువ్వులను ఈ విధంగా మీరు ఉపయోగించడం వల్ల మీ జుట్టు బాగా పొడుగ్గా పెరుగుతుంది. అలాగే జుట్టు ఒత్తుగా అవుతుంది. కొత్త జుట్టు కూడా వస్తుంది. అలాగే మందార పువ్వులను జుట్టుకు అప్లై చేయడం వల్ల డ్రై హెయిర్ సమస్య ఇక ఉండదు. అలాగే మీ జుట్టు షైనీగా,  మృదువుగా మారుతుంది.
 

మందార పువ్వులు మన నెత్తిమీద రక్త ప్రసరణను పెంచడానికి కూడా సహాయపడతాయి. అలాగే జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. మందార పువ్వుల్లో ఉండే ఫ్లేవనాయిడ్లు హానికరమైన యువీ కిరణాల నుండి నెత్తిని రక్షిస్తాయి. దీనిలోని శీతలీకరణ లక్షణాలు నెత్తిమీద ఆరోగ్యంగా ఉంచుతాయి.

మందార పువ్వులు, ఆకుల్లోని  శ్లేష్మ కంటెంట్ సన్నని స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది డ్రై హెయిర్ సమస్యను తొందరగా తగ్గిస్తుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

చుండ్రు కోసం మందార పువ్వును ఎలా ఉపయోగించాలి? 

ఒక కప్పు మందార టీని తయారుచేసి పక్కన పెట్టండి. జుట్టును షాంపూతో క్లీన్ చేసిన తర్వాత  పూర్తిగా చల్లారిని ఈ టీని మీ జుట్టుకు అప్లై చేయండి. దీన్ని జుట్టుకు చివరి వాష్ గా ఉపయోగించండి.

మందారంలోని సహజ ఆమ్లాలు మీ నెత్తిమీద, జుట్టు  పీహెచ్ ను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చుండ్రు చాలా వరకు తగ్గుతుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. 

Latest Videos

click me!