ఆడవాళ్లు అంజీర పండ్లను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 3, 2024, 11:46 AM IST

మగవారికంటే ఆడవాళ్లకే తక్కువ బలం ఉంటుంది. అందులోనూ ఆడవాళ్లే తొందరగా అలసిపోతుంటారు. అయితే ఆడవాళ్లు ప్రతిరోజూ నానబెట్టిన అంజీర పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అవేంటంటే? 

అంజీర పండ్లు టేస్టీగా ఉండటమే కాకుండా ఇవి ఆడవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ చిన్న పండులో ఎక్కువ మొత్తంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యం,  శ్రేయస్సును మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అసలు ఆడవారికి అత్తిపండ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అవసరమైన పోషకాలు

అంజీరల్లోవిటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఆడవారి మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే ఎముకలను బలంగా ఉంచడానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఈ పోషకాలు చాలా అవసరం. 
 

Latest Videos


జీర్ణ ఆరోగ్యం

అత్తి పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి, మలబద్దకాన్ని నివారించడానికి ఎంతో సహాయపడుతుంది. అత్తి పండ్లలోని ఫైబర్ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ను ప్రోత్సహించడానికి  సహాయపడుతుంది. ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం.  కాబట్టి జీర్ణ సమస్యలున్నవారు కూడా ఈ అంజీర పండ్లను తినొచ్చు.
 

రుతుచక్రాన్ని నయం చేస్తుంది

అంజీర పండ్లలో ఫైటో ఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే మొక్కల సమ్మేళనాలు. ఇది ఆడవారి రుతుచక్రాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. 

figs

గుండె ఆరోగ్యం

అత్తి పండ్లలోని పొటాషియం,  ఫైబర్ రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి, ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి బాగా సహాయపడతాయి. అత్తి పండ్లను తింటే మహిళలలకు గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

బరువును నియంత్రిణ 

అంజీర  పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది వారి బరువును తగ్గించడానికి బాగా సహాయపడుతుంద.ి అత్తి పండ్లలోని ఫైబర్ కంటెంట్ కడుపును తొందరగా నింపడానికి బాగా సహాయపడుతుంది. అతిగా తినకుండా చేస్తుంది. 
 

figs

చర్మ ఆరోగ్యం

అంజీర పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీర మంటను తగ్గించి అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి సహాయపడతాయి. ఇది చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరిచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంజీర పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆడవారి చర్మం యవ్వనంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది. 
 

శరీరానికి శక్తి

అంజీర పండ్లలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆడవారికి శక్తిని అందిస్తాయి. అత్తి పండ్లను సింపుల్ గా తిన్నా లేదా స్మూతీలు, సలాడ్ లకు జోడించినా.. అవి వెంటనే,  స్థిరమైన శక్తిని శరీరానికి అందిస్తాయి. 
 

click me!