skin care
చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త పడతారు. వారికి సంబంధించి ప్రతిదాన్ని బెస్ట్ గా ఉండేట్టు చూసుకుంటారు. వారి ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయరు. సాధారణంగా చిన్న పిల్లలకు సంబంధించి అన్నీ సపరేట్ గా ఉంటాయి. ఈ బేబీ ప్రొడక్ట్స్ ను చిన్న పిల్లలకు మాత్రమే ఉపయోగిస్తారు. వేరే వారిని అస్సలు ఉపయోగించనివ్వరు. అయితే చాలా మంది బేబీ ప్రొడక్ట్స్ చిన్న పిల్లల కోసమే ప్రత్యేకించి తయారుచేయబడ్డాయి. ఇవి పెద్దవారికి పనికిరావని అనుకుంటారు. కానీ వీటిని పెద్దవారు కూడా ఉపయోగించొచ్చు. బేబీ ప్రొడక్ట్స్ లో మీరు బేబీ లోషన్ ను ఎంచక్కా ఉపయోగించొచ్చు. అదికూడా ఎన్నో విధాలుగా. అసలు బేబీ లోషన్ ను పెద్దవారు దేనిదేనికి ఉపయోగించొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
skin care tips
మాయిశ్చరైజర్ గా..
బేబీ లోషన్ ను మీరు మీ చర్మానికి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించొచ్చు. అవును సాధారణంగా బేబీ లోషన్లు హైడ్రేటింగ్ గా ఉంటాయి. అలాగే ఇది చర్మాన్ని చికాకు నుంచి కాపాడుతుంది. సున్నితమైన చర్మానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి ముందుగా మీ ముఖాన్ని క్లీన్ చేయండి. ఆ తర్వాత అవసరమైన మొత్తాన్ని పెట్టండి. ఆ తర్వాత చర్మాన్ని వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. దీంతో దీన్ని మీ చర్మం బాగా గ్రహిస్తుంది.
మేకప్ రిమూవర్ గా..
మీరు బేబీ లోషన్ ను మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించొచ్చు. బేబీ లోషన్లు చర్మంపై సున్నితంగా ఉంటాయి. అయితే ఇది మేకప్, వాటర్ ప్రూఫ్ మస్కారాను క్లీన్ చేయడంలో బాగా సహాయపడుతుంది. మేకప్ రిమూవ్ చేయడానికి బేబీ లోషన్ ను కాటన్ ప్యాడ్ పై లేదా నేరుగా మీ ముఖానికి పెట్టండి. అలాగే మేకప్ ను క్లీన్ చేయడానికి మీ చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత శుభ్రమైన కాటన్ ప్యాడ్ తో తుడవండి. లేదా గోరువెచ్చని నీటితో కడగండి.
skin care
క్యూటికల్ క్రీమ్ లాగ..
బేబీ లోషన్ కూడా ఒక గొప్ప క్యూటికల్ క్రీమ్. అలాగే హ్యాండ్ మాయిశ్చరైజర్ గా కూడా పని చేస్తుంది. ఇది మీ చేతులను మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది. చేతుల డ్రై నెస్ ను తొలగిస్తుంది. అలాగే ఇది క్యూటికల్ ను మృదువుగా చేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి మీ చేతులకు బేబీ లోషన్ ను పెట్టండి. బేబీ లోషన్ పూర్తిగా శోషించుకునే వరకు మీరు తేలికగా మసాజ్ చేయాలి.
ఫుట్ క్రీమ్ లాగ..
బేబీ లోషన్ కూడా గొప్ప ఫుట్ క్రీమ్ గా ఉపయోగపడుతుంది. ఇది మీ పొడి పాదాలను మృదువుగా చేస్తుంది. దీన్ని ఉపయోగించడానికి రాత్రి పడుకునే ముందు మీ పాదాలకు తగినంత బేబీ లోషన్ తో మసాజ్ చేయండి. పాదాలు తేమగా ఉండేందుకు సాక్స్ లను తప్పకుండా వేసుకోండి.
వడదెబ్బ నయం..
మీరు వడదెబ్బతో ఇబ్బంది పడుతుంటే మీ చర్మానికి బేబీ లోషన్ ను రాసుకోవచ్చు. బేబీ లోషన్ చర్మంపై సున్నితంగా ఉండటమే కాకుండా దాని హైడ్రేటింగ్ లక్షణాలు వడదెబ్బ అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. దీనిని ఉపయోగించడానికి మీరు బేబీ లోషన్ను వడదెబ్బ తగిలిన ప్రదేశంలో చాలా సున్నితంగా పెట్టండి.