చింతపండు మెత్తగా కాకుండా, పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Jul 23, 2024, 4:18 PM IST

వర్షాకాలం ప్రారంభమయ్యింది. ఈ సీజన్ లో వంటింటి వస్తువులు చాలా తొందరగా పాడవుతాయి. వీటిలో చింతపండు ఒకటి. వానాకాలం వచ్చేసరికి చింతపండు మెత్తగా అవుతుంది. అలాగే పురుగులు కూడాపడతాయి. ఇలా  జరగకూడదంటే ఏం చేయాలో తెలుసా? 
 

వర్షాకాలంలో తేమ వల్ల ప్రతిదీ జిగటగా, తడిగా మారుతుంది. ముఖ్యంగా చింతపండు. వానాకాలం రాగానే చింతపండు మెత్తగా అవ్వడమే కాకుండా.. పురుగులు కూడా పడతాయి. ముందే చింతపండును పప్పులు, సాంబార్ నుంచి చట్నీల వరకు చాలా వంటల్లో ఉఫయోగిస్తారు. అందుకే ఇది వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి ప్రతి ఒక్క సీజన్ లో చింతపండు నిల్వ ఉంటుంది. కానీ ఒక్క వానాకాలంలోనే చింతపండు చెడిపోతుంది. వర్షాకాలంలో తేమ వల్ల చింతపండు మెత్తగా అయ్యి పురుగులు పడతాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం చింతపండు మెత్తగా కాదు, పురుగులూ పట్టవు. ఇందుకోసం ఏం చేయాలంటే? 

కంటైనర్

చింతపండు మెత్తగా కాకుండదంటే.. తేమ తగలని, గాలి వెళ్లని డబ్బాలో నిల్వ చేయాలి. ఇది తేమ, గాలితో సంబంధం లేకుండా చింతపండును నిల్వ చేస్తుంది. దీనివల్ల చింతపండు త్వరగా పాడవదు. 

పొడి, చల్లని స్థలం 

వర్షాకాలంలో చింతపండును ఎప్పుడూ కూడా పొడి, చల్లని ప్రదేశంలో ఉంచాలి. చింతపండు తేమ ప్రదేశాల్లో చాలా తొందరగా పాడవుతుంది. 



ఫ్రిజ్‌లో .. 

వాతావరణం ఎక్కువ తేమగా ఉంటే చింతపండును రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్‌లో పెట్టండి. చింతపండును రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువసేపు ఉంచడం వల్ల కీటకాలు పట్టవు. తడిగా కూడా మారదు. ఇది కాకుండా మీరు చింతపండును గాలి చొరబడని డబ్బాలో లేదా రిఫ్రిజిరేటర్‌లో జిప్ లాక్ బ్యాగ్‌లో కూడా పెట్టొచ్చు. 

Tamarind


ఉప్పు 

చింతపండును ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే దానికి కాస్త ఉప్పును వేయండి. ఎందుకంటే ఉప్పు తేమను గ్రహిస్తుంది. కీటకాలు, పురుగుల నుంచి కాపాడుతుంది. ఇకపోతే బాగా ప్యాక్ చేసిన చింతపండును మాత్రమే కొనండి. అలాగే పొడిగా ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. తడి, పచ్చి చింతపండు త్వరగా పాడవుతుంది.

tamarind

చింతపండును నిల్వ ఉంచిన కంటైనర్‌లో వేప లేదా బిర్యానీ ఆకులను వేయండి. ఈ ఆకులు సహజంగా క్రిమిసంహారక, కీటకాల నుంచి చింతపండును రక్షిస్తాయి.అలాగే చింతపండును నిల్వ చేయడానికి గాజు పాత్రలను ఉపయోగించండి.  ఎందుకంటే ఇది తేమ లోపలికి రాకుండా చేస్తుంది. చింతపండును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఏదైనా చెడిపోతే దానిని వెంటనే తొలగించండి.  దీనివల్ల మిగిలిన చింతపండు చెడిపోదు. అలాగే ఎండగా ఉన్నప్పుడు చింతపండును కాసేసు ఎండలో పెట్టండి. దీంతో చింతపండు చెడిపోదు. 

Latest Videos

click me!