పర్ఫెక్ట్ గా చీర ఎలా కట్టుకోవాలో తెలుసా?

First Published | Jul 23, 2024, 3:26 PM IST

అంబానీ పెళ్లిని చూస్తే.. అబ్బా ఎంత బాగా రెడీ అయ్యారు.. సెలబ్రిటీలు చీరలను ఇలా పర్ఫెక్ట్ గా ఎలా కట్టుకుంటారబ్బా.. అని చాలా మంది అనుకుంటుంటారు. ఒక సెలబ్రిటీలే కాదు.. మీరు కూడా పర్ఫెక్ట్ గా చీరను కట్టుకోవచ్చు. అదికూడా కొన్ని చిట్కాలను ఫాలో అయితే.. 
 

ఇండియాలో ఆడవాళ్లు ఎక్కువగా చీరలనే కట్టుకుంటారు. ఆఫీసులకు వెళ్లే చాలా మంది చీరనే కంఫర్ట్ గా ఫీలవుతారు. ఎక్కడో తక్కువ మంది మాత్రమే చుడీదార్ లు, జీన్స్ లో వెళతారు. చీర కట్టుకోవడం భారతీయ సంప్రదాయాల్లో ఒకటిగా వస్తోంది. అయితే అందరూ చీరలు కట్టుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే చీరను పర్ఫెక్ట్ గా కట్టుకుంటారు. కానీ చాలా మందికి చీరను కట్టుకున్నప్పటి నుంచి దాన్ని చూస్తుకుంటూనే ఉంటారు. సర్దుకుంటూనే ఉంటారు. దీనివల్ల కంఫర్ట్ గా ఉండలేరు. అయితే మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం హీరోయిన్ల లాగ  చీరను పర్ఫెక్ట్ గా కట్టుకోవచ్చు. అదెలాగో ఓ లుక్కేద్దం పదండి. 

ఎక్కువ పిన్నులతో..

చీరకట్టుకున్నామంటే ఆ చీరకే మీరు అందం తీసుకొచ్చేలా ఉండాలి. అందుకే చీరను కట్టుకున్నప్పుడు చీర మొత్తాన్ని పిన్నీసులతో చుట్టేయకండి. చాలా మంది చీర కట్టుకున్నారంటే. భుజం పై రెండు, నడుము దగ్గర ఓ మూడు ఇలా పిన్నీసులను వాడేస్తారు. కానీ భుజంపై, నడుము దగ్గర చింగులు అమర్చడానికి ఒకటి లేదా రెండు పిన్నులను పెడితే సరిపోతుంది. మీరు కట్టుకున్న చీర బరువుగా ఉంటే భుజం మీద రెండు పిన్నులు, నడుము దగ్గర చీర కట్టిన తర్వాత ఒక పిన్నీసును చీర పెటికోట్ తో పెడితే సరిపోతుంది. ఇది మీ చీరను అందంగా కనిపించేలా చేస్తుంది. 
 


బ్లౌజ్

చీర కట్టుకున్నప్పుడు మీరు బ్లౌజ్ పై కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి.  ఎందుకటే బ్లౌజ్ నెక్ తక్కువగా ఉన్నా.. లేదా సరిగ్గా లేకపోయినా..  అప్పుడు చీర  పల్లు దానిపై బిగించకూడదు. ఇలా చేస్తే మీకు కంఫర్ట్ గా ఉండదు. బ్లౌజ్ ఎప్పుడైనా సరే టైట్ గా లేదా చాలా లూజ్ గా ఉండకూడదు. బ్లౌట్ ఫిట్ గా ఉంటేనే మీ లుక్ బాగుంటుంది. 
 

పెటికోట్ ల మ్యాచింగ్

మందపాటి చీరైనా, పలుచని చీరనా.. ఏ చీర మ్యాచింగ్ పెటికోట్ ను ఆ చీరకే వేసుకోవాలి. చాలా మంది ఈ చీరలో కనిపించదని వేరే కలర్ సారీ పెటికోట్ ను వేసుకుంటుంటారు. కానీ ఇలా చేయకూడదు. అలాగే, చీర ఫ్యాబ్రిక్ తో పాటుగా పెటికోట్ నాణ్యతపై కూడా పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఒక చిన్న మిస్టేక్.. మీ అందాన్ని పాడు చేస్తుంది. 
 

చీర కట్టుకోవడం ఒక కళ. మీరు రోజూ చీరను కట్టుకున్నా.. మొదటిసారి చీరను కట్టుకోబోతున్నా.. చీరలో అందంగా కనిపించాలంటే మాత్రం చీర కట్టే విధానంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చీరను మరింత నడుము దగ్గర మరింత కిందికి కట్టుకున్నా.. మరీ పైకి కట్టుకున్నా.. మీ లుక్ అస్సలు బాగుండదు. చీరలో మీ లుక్ వావ్ అనిపించేలా ఉండాలంటే.. చీరను ఎప్పుడూ కూడా నాభి వద్దే కట్టండి. ఇది మీ చీరను చాలా లావుగా చూపించదు. లేదా చాలా ఎత్తుగా కూడా ఉండదు. చీరను నడుము కిందికి కట్టడం వల్ల మీకు కంఫర్ట్ గా ఉండదు. అలాగే దీనివల్ల చీర లూజ్ గా అవుతుందనే భయం కూడా ఉంటుంది. 

Latest Videos

click me!