కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | May 11, 2024, 4:02 PM IST

ఎండాకాలంలో పుదీనా, పచ్చి కొత్తిమీర, కరివేపాకును ఎన్నో విధాలుగా ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంటాయి. అయితే ఈ మూడు చాలా తొందరగా వాడిపోవడం, పాడవడం జరుగుతుంది. కానీ కొన్ని చిట్కాలతో మీరు కరివేపాకు, పుదీనా, కొత్తిమీరలను ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. అదెలాగంటే? 
 

ఎండాకాలంలో పుదీనా, కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మజ్జిగతో పాటుగా ఎన్నో  పానీయాల్లో వీటిని ఉపయోగిస్తుంటారు. ఈ సీజన్ లో పుదీనా డ్రింక్ ను ఎక్కువగా తాగడం వల్ల పొట్ట చల్లబడుతుంది. అలాగే పుదీనాను, కొత్తిమీరను చట్నీలో వేసి తింటుంటారు. పచ్చి కొత్తిమీరను గార్నిష్ చేయడానికి, చట్నీల తయారీకి ఉపయోగిస్తారు. కరివేపాకు ఫుడ్ రుచిని పెంచడానికి సహాయపడుతుంది. అయితే ఈ మూడు చాలా తొందరగా వాడిపోవడం, పాడవడం, ఎండిపోవడం జరుగుతుంది. కానీ ఇవి తాజాగా ఉంటేనే ఫుడ్ రుచి పెరుగుతుంది. ఈ మూలికలు వేడి ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. అందుకే చాలా త్వరగా నశిస్తాయి. మీరు వీటి రంగు, వాసన, రుచిని సంరక్షించాలనుకుంటే మాత్రం ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. 


1. కొత్తిమీర

కొత్తిమీర ఆకులు చాలా సున్నితంగా ఉంటాయి. సరిగ్గా నిల్వ చేయకపోతే ఇవి వాడిపోయి ఎండిపోతాయి. కొత్తిమీర తాజాదనాన్ని కాపాడుకోవడానికి ఇలా చేయండి. 

చెడిపోయిన ఆకులను తొలగించండి

కొత్తిమీరను నిల్వ చేయడానికి పసుపు లేదా నల్ల అంటే పాడైన ఆకులను వెంటనే తొలగించండి. ఇలా చేయడం వల్ల మీ కొత్తిమీర త్వరగా చెడిపోదు. అలాగే చాలా రోజుల వరకు ఆకులు తాజాగా ఉంటాయి. 
 

Latest Videos


Coriander Leaves

కాండాన్ని కత్తిరించండి

ఏదైనా పొడి లేదా చెడిపోయిన భాగాలను తొలగించడానికి కొత్తిమీర దిగువ చివర్లను కట్ చేయండి. ఇది కాండం నీటిని మరింత సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది, ఆకులను హైడ్రేట్ గా, తాజాగా ఉంచుతుంది.
 

నీటిలో నిల్వ చేయండి

మీరు మార్కెట్ నుంచి కొత్తిమీరను కొని ఇంటికి తెచ్చిన వెంటనే వాటి కాండాన్ని కట్ చేసి నీటితో నిండిన బౌల్ లో పెట్టండి. కొత్తిమీరను ఈ విధంగా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే తరిగిన కొత్తిమీర కట్టలను నీటితో నిండిన గ్లాసు లేదా జార్లో పెట్టండి. అలాగే పై నుంచి ఆకులను ప్లాస్టిక్ సంచితో కప్పండి. ఈ జాడీల చుట్టూ రబ్బరు బ్యాండ్లతో సురక్షితంగా ఉంచండి. ఈ ఆకులు రీఫ్రెష్ గా ఉండాలంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండండి. 

తడి కాగితపు టవల్

కొత్తిమీరను నీటిలో నిల్వ చేయకూడదనుకుంటే మీరు వీటిని తడి కాగితపు టవల్ లో చుట్టి ఒక మంచి ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని సీల్ చేసి అందులో కొత్తిమీరను పెట్టొచ్చు. ఈ ఆకులు ఒక వారం వరకు తాజాగా ఉండటానికి బ్యాగ్ ను ఫ్రిజ్ లో  వెజిటబుల్ డ్రాయర్ లో పెట్టండి. 

2. పుదీనా ఆకులు

పుదీనా ఆకులను పానీయాలు, సలాడ్లు, స్వీట్లతో సహా ఎన్నో రకాల వంటకాలకు తాజా, చీజీ రుచిని అందించడానికి ఉపయోగిస్తారు. పుదీనా ఆకులను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి మీరు ఏం చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అధిక తేమను తొలగించండి

పుదీనా ఆకులను కడిగిన తర్వాత తేమ ఎక్కువగా ఉండకుండా చేయడానికి కాగితపు టవల్స్ తో వాటిని సున్నితంగా నొక్కండి.  తేమ ఎక్కువగా ఉంటే పుదీనా ఆకులు జిగటగా మారుతాయి. అలాగే ఆకులు కూడా తొందరగా పాడవుతాయి.

కాగితపు టవల్స్ 

పొడి పుదీనా ఆకులను పేపర్ టవల్స్ లో ఉంచడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఆకులను కడిగి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని కాగితపు టవల్స్ మీద ఉంచి మొత్తం కవర్ చేయండి. ఇది కాకుండా మీరు ఆకుల పొర మధ్యలో కాగితపు టవల్స్ కూడా ఉంచొచ్చు. ఆ తర్వాత వీటిని సీల్డ్ ప్లాస్టిక్ సంచిలో ఉంచండి. వీటిని ఫ్రిజ్ లో ఉంచండి. వీటిని వెజిటబుల్ క్రిస్పర్ డ్రాయర్ లో పెట్టండి. చల్లని ఉష్ణోగ్రతలు పుదీనా ఆకుల ఎండిపోకుండా, చెడిపోకుండా కాపాడుతాయి. ఇలా చేయడం వల్ల పుదీనా ఆకులు ఒక వారం వరకు తాజాగా ఉంటాయి. 
 

3. కరివేపాకు

కరివేపాకు దక్షిణ భారతీయ వంటకాల్లో బాగా ఉపయోగిస్తారు. దీనికున్న ప్రత్యేక రుచి, సువాసన వల్ల దీన్ని ప్రతి వంటలో ఉపయోగిస్తారు. అయితే ఈ కరివేపాకులు చాలా తొందరగా ఎండిపోతుంటాయి. కానీ కొన్ని చిట్కాలతో వీటిని చాలా రోజుల వరకు తాజాగా ఉంచొచ్చు. 
 

ఎండు కరివేపాకు

తాజా కరివేపాకును శుభ్రమైన కిచెన్ టవల్ లేదా పేపర్ టవల్ పై ఒకే పొరలో స్ప్రెడ్ చేయండి. అవి పూర్తిగా ఆరిపోయే వరకు కొన్ని గంటలు గాలిలో ఆరనివ్వండి. అదనపు తేమను తొలగించడం వల్ల బూజు పట్టదు. అలాగే వీటిని ఎక్కువ రోజులు నిల్వ చేయొచ్చు. 
 

గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ 

కరివేపాకును గాలి చొరబడని కంటైనర్ లేదా గాజు జార్లో పెట్టి గాలి వెళ్లకుండా మూతపెట్టి నిల్వ చేసిన చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. దీనివల్ల కరివేపాకులకు తేమ పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే మీరు కరివేపాకు పెట్టే కంటైనర్ శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి. 
 

చల్లని ప్రదేశంలో ఉంచండి.

మీరు నిల్వ చేసిన కరివేపాకు కంటైనర్లకు ఎండ, వేడి తగలకుండా చూసుకోవాలి. అలాగే వీటిని చల్లని, ముదురు ప్యాంట్రీలో నిల్వ చేయండి. కరివేపాకు నేరుగా సూర్యరశ్మి లేదా వేడి వల్ల పొడిగా, చెడిపోతుంది. మీరు దీనిని రిఫ్రిజిరేటర్ లో సీల్డ్ బ్యాగ్ లో కూడా ఉంచొచ్చు. ఇది ఆకుల రుచిని,  వాసనను అలాగే ఉంచుతుంది. 
 

click me!