జీన్స్ కు అంటిన మొండి మరకలను ఎలా పోగొట్టాలి?

First Published | May 11, 2024, 11:50 AM IST

అబ్బాయిలు, అమ్మాయిలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జీన్స్ ప్యాంట్ లను ఉపయోగిస్తున్నారు. కానీ జీన్స్ ప్యాంట్ లను మెయింటైన్ చేయడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే వీటికి ఏవైనా మరకలు అంటినప్పుడు అంత సులువుగా పోవు. కానీ కొన్ని చిట్కాలతో జీన్స్ ప్యాంట్ కు అంటుకున్న మరకలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. ఎలాగంటే? 
 

జీన్స్ వేసుకోవాలనే క్రేజ్ ఈ రోజుల్లో ప్రతి మహిళలో ఉంది. స్కూల్ నుంచి కాలేజీకి అమ్మాయిలు, ఆఫీసుకు వెళ్లి పనులు చేసే అన్ని వయసుల మహిళలు కూడా జీన్స్ ను వేసుకుంటున్నారు. అయితే చాలా సార్లు ఆడవారు రెడీ అయిన తర్వాత కూడా ఇంటి పనులు చేయాల్సి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిలో వంటింట్లో పని చేసేటప్పుడు జీన్స్ మీద నూనె మరకలు పడుతుంటారు. కానీ ఈ నూనె మరకలు చాలా మొండిగా ఉంటాయి. ఈ నూనె మరకలను తొలగించడం అంత సులువైన పని కాదు. కానీ కొన్ని సులువైన చిట్కాలతో జీన్స్ కు అంటుకున్న నూనె మరకలను చాలా సులువుగా తొలగించొచచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జీన్స్ పై మొండి నూనె మరకలను తొలగించడం ఎలా?

బేకింగ్ సోడా నూనె మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది ఒక సహజ శోషకం. బేకింగ్ సోడా నూనె మరకలను గ్రహిస్తుంది. ఇందుకోసం జీన్స్ పై పడిన నూనె మరకలపై బేకింగ్ సోడాను చల్లి 15 నుంచి 30 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత బ్రష్ తో కడిగి శుభ్రమైన నీటితో కడిగేయండి.
 

Latest Videos


షాంపూతో.. 

షాంపూతో కూడా జీన్స్ పై పడిన నూనె మరకలను తొలగించొచ్చు. ఇందుకోసం మరకలపై కొన్ని చుక్కల షాంపూను అప్లై చేయండి. 10 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయండి. ఆ తర్వాత జీన్స్ ను బ్రష్ తో రుద్ది క్లీన్ చయండి.  

టూత్ పేస్ట్ తో..

ముందుగా టూత్ పేస్ట్ ను జీన్స్ అంటిని మరకలపై అప్లై చేయండి. దీనిని బ్రష్ తో రుద్ది క్లీన్ చేయండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఎండలో ఆరబెట్టండి.

నిమ్మరసంతో..

జీన్స్ పై ఉన్న మొండి నూనె మరకలపై నిమ్మరసాన్ని అప్లై చేయండి. అలాగే దీనిపై డిటర్జెంట్ ద్రావణాన్ని పోసి బ్రష్ కొద్దిగా రుద్ది శుభ్రం చేయండి. 

click me!