water tank
ఎండాకాలంలో వాటర్ ట్యాంక్ వేడిగా అవ్వడం చాలా కామన్. మండే ఎండల వల్ల ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ కూడా వేడిగా అవుతుంది. దీని వల్ల ఇంట్లో ఉండే ప్రతి కులాయి నుంచి నీళ్లు వేడిగా వస్తాయి. ఈ కాలంలో వాటర్ ట్యాంక్ నీళ్లు వేడిగానే ఉంటాయి.. వీటిని చల్లగా చేయలేమని చాలా మంది అనుకుంటుంటారు. కానీ వాటర్ ట్యాంక్ లో నీరు వేడిగా కాకుండా కూడా చేయొచ్చు. అదెలాగో ఇపపుడు తెలుసుకుందాం పదండి.
వేసవిలో వాటర్ ట్యాంక్ చల్లగా ఉండాలంటే ఏం చేయాలి?
ట్యాంకుకు తెలుపు రంగు
వైట్ కలర్ వేడిని గ్రహిందు. అందుకే మీ ఇంటిపై వైట్ కలర్ ట్యాంక్ ను పెట్టండి. కానీ చాలా మంది బ్యాక్ కలర్ ట్యాంక్ ను మాత్రమే ఇంటిపై పెట్టించుకుంటుంటారు. కానీ ఇవి వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. ఒకవేళ మీ వాటర్ ట్యాంక్ నల్లగా ఉంటే దానికి వైట్ కలర్ పెయింట్ వేయండి.
ట్యాంక్ చుట్టూ మట్టి
మట్టి వాటర్ ట్యాంకును చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే ట్యాంక్ చుట్టూ మట్టిని పూయండి. లేదంటే కనీసం ట్యాంకు చుట్టూ తడి మట్టితో నిండిన కుండలైనా పెట్టండి. దీనివల్ల వాటర్ ట్యాంక్ లో నీళ్లు చల్లగా ఉంటాయి.
water tank
ట్యాంకును నీడలో
ట్యాంక్ ను పైకప్పుపై బహిరంగ, ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచితేనే నీళ్లు వేడిగా అవుతాయి. అందుకే వాటర్ ట్యాంక్ ను ఎప్పుడూ కూడా చెట్లు లేదా గడ్డి నీడలో ఉంచండి. వీలైతే ట్యాంకును ఉత్తర గోడకు దగ్గరలో పెట్టండి. ఎందుకంటే ఈ దిక్కు ఎండ ఎక్కువగా ఉండదు.
ట్యాంక్ చుట్టూ థర్మోకోల్
ఎండాకాలంలో వాటర్ ట్యాంక్ చుట్టూ థర్మోకోల్ పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ వేడిని ట్యాంకుకు చేరనివ్వదు. ఇలా చేసిన తర్వాత మీ ఇంట్లోని కుళాయిల నుంచి కూల్ వాటర్ వస్తుంది. దీనివల్ల మీరు వేడి నుంచి కూడా కొంత ఉపశమనం పొందుతారు.