నానపెట్టిన మెంతులు..జుట్టుకు కాదు, ముఖానికి పెడితే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 6, 2024, 9:55 AM IST

ఇదే మెంతులను నానపెట్టి.. జుట్టుకు కాకుండా.. మన ముఖానికి రాస్తే.. మన చర్మం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
 

మెంతులు.. దాదాపు మన అందరి కిచెన్ లో ఉంటూనే ఉంటాయి. వీటిని మనం వంటకు ఉపయోగిస్తూ ఉంటాం.  కానీ.. ఇవే మెంతులను మనం సౌందర్య సాధనంగా వాడతాం. ఎక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే... మెంతులను నానపెట్టి.. దానిని పేస్టు చేసి.. తలకు రాస్తే.. జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులో నిజం ఉంది. అయితే.. ఇదే మెంతులను నానపెట్టి.. జుట్టుకు కాకుండా.. మన ముఖానికి రాస్తే.. మన చర్మం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
 

మెంతులు.. ముఖాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. అందంగా మార్చడం అంటే అలా ఇలా కాదు...మీ వయసు తగ్గిపోతుంది.  మెంతుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. మెటిమల సమస్యను కూడా  తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖంపై ముడతలు రాకుండా, డార్క్ స్పాట్స్  తొలగిపోయేలా, ఏవైనా ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడటంలోనూ సహాయపడతాయి.

Latest Videos


మరి, ఈ మెంతులను జుట్టుకు ఎలా అప్లై చేయాలి..? ముఖానికి ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకుందాం...
మెంతులు జుట్టుకు అప్లై చేయడం వల్ల... తలలో చుండ్రు, దురద లాంటివి రాకుండా ఉంటాయి. ఎందుకంటే.. మెంతుల్లో లెసిథిన్  ఎక్కువగా ఉంటుంది. ఇది... స్కాల్ప్ ని జుట్టు కుదుళ్లు బలంగా మార్చడానికి సహాయపడతాయి. తొందరగా.. జుట్టు తెల్లగా మారకుండా కాపాడటంలో సహాయపడతాయి. జుట్టు మంచి కండిషనర్ గా కూడా పని చేస్తుంది.

రెండు స్పూన్ల మెంతులను నీటిలో నానపెట్టాలి. రాత్రంతా నానపెట్టిన వాటిని ఉదయాన్నే పేస్టులా చేసి.. తలకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత.. తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇదే మెంతుల పేస్టులో కొద్దిగా కొబ్బరి పాలు కలిపి కూడా రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల..జుట్టు మరింత బలంగా మారుతుంది. జుట్టు పలచగా ఉన్నవారికి.. ఇది చాలా బాగా పని చేస్తుంది.
 

Fenugreek

మరి ఫేస్ కి ఎలా వాడాలి..?
మెంతులు... మన అందాన్ని మరింతగా పెంచడానికి సహాయపడతాయి. ముఖంపై ముడతలు రాకుండా, బ్లాక్ హెడ్స్ రాకుండా, స్కిన్ డ్రైనెస్ ని తొలగించడానికి, మొటిమలు రాకుండా కాపాడటంలో సహాయపడతాయి.

fenugreek

దీని కోసం.. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో మెంతులు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని దాదాపు ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టేయాలి. రాత్రంతా దానిని పక్కన పెట్టేయాలి. ఉదయాన్నే దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ ని ముఖానికి అప్లై చేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత.. ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్ దీనిని ట్రై చేయడం వల్ల.. ముఖంపై ముడతలు, మొటిమలు తగ్గిపోవడంతో పాటు... ముఖం తాజాగా మెరిసిపోయేలా చేస్తుంది. 

click me!