షేవింగ్ చేయకుండా.. చంకలో వెంట్రుకలు పోవాలంటే ఇలా చేయండి

First Published | Nov 6, 2024, 10:17 AM IST

ఆడవాళ్లకు ఇది పెద్ద సమస్యగా ఉంటుంది. దీనికోసం ఎంతో  ఇబ్బంది పడతారు. ఈ వెంట్రుకలను షేవింగ్ చేయడం వల్ల గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే షేవింగ్ చేయకుండా ఈ వెంట్రుకలను తొలగించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చాలా మంది ఆడవాళ్లకు చంకలో జుట్టు పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. చాలా సార్లు ఈ హెయిర్ వల్ల చంకల్లో దుర్వాసన వస్తుంటుంది. ఈ అవాంఛిత వెంట్రుకలను తొలగించడానికి కొంతమంది వందలు, వేలు ఖర్చు పెడుతుంటారు. మరికొంతమంది ఖరీదైన వస్తువులను కొంటుంటారు.

ఇంకొందరు షేవింగ్ చేస్తుంటారు. కానీ షేవింగ్ వంటి పద్దతుల వల్ల చంకల్లో గాయాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఇవేవీ కాకుండా.. చంకల్లో వెంట్రుకలను చాలా సులువుగా ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పసుపు, పాల పేస్ట్

పసుపు, పాలతో చంకల్లో ఉన్న వెంట్రుకలను చాలా సులువుగా పోగొట్టొచ్చు. పసుపులో శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అవాంఛిత రోమాలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

ఈ పేస్ట్ ను తయారుచేయడానికి రెండు టేబుల్ స్పూన్ల పసుపులో తగినన్ని పాలను పోసి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను అండర్ ఆర్మ్స్ మీద అప్లై చేసి 20 లేదా 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. 
 


షుగర్, లెమన్ వ్యాక్స్

చంకల్లో వెంట్రుకలను తొలగించడానికి చక్కెర, నిమ్మకాయ వ్యాక్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి ఒక కప్పు చక్కెరలో 1 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంటమీద వేడిచేయండి.

ఇది బంగారు గోధుమ రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత మీ అండర్ ఆర్మ్స్ కు అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత ఒక తడి గుడ్డను తీసుకుని దాన్ని జుట్టు పెరుగుదలకు వ్యతిరేక దిశలో చంకలో పెట్టి త్వరగా లాగండి. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవాంఛిత చంక వెంట్రుకలను తొలగించడానికి సహాయపడుతుంది.
 

బంగాళాదుంప, కాయధాన్యాల మాస్క్

బంగాళాదుంపలు కూడా చంకలో వెంట్రుకలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుది. దీనిలో ఉండే నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు అండర్ ఆర్మ్ జుట్టును తొలగించడానికి సహాయపడతాయి. ఈ మాస్క్ ను తయారుచేయడానికి ఒక బంగాళాదుంపను, 1/2 కప్పు నానబెట్టిన గింజలతో మెత్తగా కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ అండర్ ఆర్మ్స్ కు అప్లై చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. అయితే దీన్ని 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత కడగాలి. ఈ మాస్క్ ను వారానికి 2 లేదా 3 సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందుతారు. 
 

ఎగ్ వైట్, కార్న్ స్టార్చ్ మాస్క్

చాలా సులువుగా చంకల్లోని వెంట్రుకలను పోగొట్టొచ్చు. మీకు తెలుసా? గుడ్డులోని తెల్లసొన అండర్ ఆర్మ్ వెంట్రుకలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ మాస్క్ ను తయారుచేయడానికి  ఒక గుడ్డు తెల్లసొనలో  ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని వేసి కలపండి.

ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ కు అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 

Latest Videos

click me!