ఇదొక్కటి పెట్టినా.. ముఖంపై ఉన్న వెంట్రుకలు మొత్తం పోతాయి

First Published | Nov 5, 2024, 3:22 PM IST

కొంతమంది ఆడవారికి బుగ్గలు, నుదురు, గడ్డం మీద పెద్దపెద్దగా వెంట్రుకలు ఉంటాయి. ఇవి వారి అందాన్ని తగ్గించడమే కాకుండా.. నలుగురిలోకి వెళ్లడానికి కూడా సిగ్గుపడేలా చేస్తాయి. ఇలాంటి వెంట్రుకలను పోవడానికి ఏం చేయాలో తెలుసా? 

ముఖంపై వెంట్రుకల సమస్య చాలా మంది ఆడవారికి ఉంటుంది. ఈ వెంట్రుకలను తొలగించడానికి షేవింగ్, వ్యాక్సింగ్ లేదా హెయిర్ రిమూవల్ క్రీములు వంటి ఎన్నో పద్దతులను ఫాలో అవుతుంటారు. కానీ ఇవేవీ అంత సౌకర్యవంతంగా ఉండవు. ఎందుకంటే వీటివల్ల కొన్నిసైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. 
 

కానీ మీరు ఇవేవీ వాడకుండా చాలా సులువుగా ఉండే ఉండే వస్తువులతో ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించొచ్చు. వీటివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ముఖంపై ఉండే జుట్టు పెరుగుదలను తగ్గించడానికి, అలాగే వాటిని పూర్తిగా తొలగించడానికి సహాయపడే కొన్ని సహజ పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పసుపు

పసుపు ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వల్ల పసుపును సాంప్రదాయ వైద్యంలో ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖంపై ఉన్న వెంట్రుకలు పోవడానికి పసుపును ఉపయోగించడానికి.. పసుపులో నీళ్లు లేదా పాలు కలిపి పేస్ట్ ను చేయండి. దీన్ని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో పెట్టి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగి శుభ్రం చేయండి. 


చక్కెర నిమ్మరసం

చక్కెర, నిమ్మరసం కూడా ముఖంపై ఉండే వెంట్రుకలను చాలా సులువుగా తొలగిస్తాయి. ఇందుకోసం నిమ్మరసంలో పంచదారను కలిపి పేస్ట్ లా చేసి అవాంఛిత రోమాలు ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయండి. దీన్ని మీ ముఖంపై వృత్తాకార కదలికల్లో సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇది మీ ముఖంపై ఉన్న అవాంచిత రోమాలను తొలగించడమే కాకుండా.. మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది. దీంతో మీ ముఖ చర్మం మృదువుగా, గ్లో అవుతుంది.

తేనె

తేనెలో ఉండే లక్షణాలు మీ ముఖంపై ఉన్న జుట్టు పెరగకుండా ఆపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నిమ్మరసంలో తేనెను మిక్స్ చేసి అవాంఛిత రోమాలపై అప్లై చేయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని  ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ముఖంపై అవాంఛిత రోమాలు రాకుండా ఆపుతాయి. 

Facial Hair

బొప్పాయి

బొప్పాయి కూడా ముఖంపై ఉండే వెంట్రుకలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే  పాపైన్ అనే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను విచ్ఛిన్నం చేయడానికి, ఆ వెంట్రుకలు పెరగకుండా ఆపడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బాగా పండిని బొప్పాయి గుజ్జును తీసుకుని ముఖంపై అవాంఛిత రోమాలపై పెట్టండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. మీరు బొప్పాయిని రెగ్యులర్ గా ఉపయోగిస్తే మాత్రం మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
 

వోట్ మీల్

ఓట్ మీల్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్ మీల్ మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అలాగే చనిపోయిన చర్మ కణాలను కూడా సులువుగా తొలగిస్తుంది. దీనిని వాడటం వల్ల ముఖంపై వెంట్రుకలు తక్కువగా పెరుగుతాయి. ఇందుకోసం ఓట్స్ లో తేనె, నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి పెట్టి కొద్దిసేపు మసాజ్ చేయండి. ఈ ఓట్స్ మీ చర్మాన్ని మృదువుగా, వెంట్రుకలు పెరగకుండా చేయడానికి సహాయపడుతుంది. 

Latest Videos

click me!