దీనిని ఎలా ముఖానికి రాయాలి..?
కలబంద మొక్క నుంచి తీసిన గుజ్జు, శెనగపిండి, బంగాళదుంప రసం, తీసుకుని ఒక గిన్నెలో వేయాలి. వీటిని బాగా కలిపి ఆ తర్వాత.. ఆ పేస్టును ముక్కుపై రాయాలి. అలా రాసిన తర్వాత పది నిమిషాల పాటు ఆగాలి. ఆ తర్వాత ముక్కుపై స్క్రబ్బింగ్ చేయడం మొదలుపెట్టాలి. చేతులతో సున్నితంగా రుద్దుతూ.. ముఖం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో ముఖానికి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫేస్ వాష్ వాడొచ్చు.
ఈ రెమిడీని కనీసం వారానికి మూడు సార్లు అయినా రాయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. ఈజీగా ఆ ముక్కుపైన ఉన్న బ్లాక్ హెడ్స్ మొత్తం పోతాయి.