కీరదోస ముక్కలను చక్రాల్లా కోసి.. కంటి మీద పెట్టుకుంటే..డార్క్ సర్కిల్స్ తగ్గడమే కాకుండా.. కళ్లకు చల్లదనం కూడా లభిస్తుంది.
Image credits: gemini
Telugu
గ్రీన్ టీతో మ్యాజిక్
వాడిన గ్రీన్ టీ బ్యాగ్‌లను పడేయకుండా కాసేపు ఫ్రిజ్ లో ఉంచి, ఆపై కళ్లపై ఓ 15 నిమిషాల పాటు ఉంచండి. ఇది కళ్లకు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Image credits: Freepik
Telugu
తాజా కలబంద జెల్...
తాజా కలబంద గుజ్జును నల్లటి వలయాలు ఉన్న చోట రాయండి. ఇది కళ్లకు చల్లదనాన్ని అందించి, నలుపును తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
బాదం నూనెతో మసాజ్
బాదం నూనెతో కళ్ల కింద సున్నితంగా మసాజ్ చేయడం కళ్లకు చాలా మంచిది. ఇది చర్మానికి నిగారింపునిచ్చి, కళ్లకు చల్లదనాన్ని అందించడంలో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
పెరుగుతో ప్యాక్ వేసుకోండి
రెండు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన పెరుగును కళ్ల కింద అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
Image credits: Getty
Telugu
బంగాళదుంప రసంతో ఫలితం
బంగాళదుంపను చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి రసం తీయండి. ఈ రసాన్ని కళ్ల చుట్టూ రాసి, 15 నిమిషాల తర్వాత బాగా చల్లగా ఉన్న నీటితో కడిగేయండి.