నోటి చుట్టూ ఉన్న నలుపును ఎలా పోగొట్టాలి?

First Published Jun 13, 2024, 3:50 PM IST

కొంతమందికి మూతిచుట్టూర నల్లగా ఉంటుంది.  మొకమంతా ఒక రంగులో ఉంటుంది. ఇది అందాన్ని తగ్గిస్తుంది. చాలా మందికి దీన్ని ఎలా పోగొట్టాలో తెలియక బాధపడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో నోటి చుట్టు ఉన్న నలుపును పోగొట్టొచ్చు. అదెలాగంటే.

కొంతమందికి ముఖమంతా ఒక కలర్ లో, నోటిచూట్టూ ఉన్న చర్మం ఒక రంగులో అంటే మరీ నల్లగా ఉంటుంది. ఇది అందాన్ని తగ్గించడమే కాకుండా.. ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. చాలా మంది ఈ నలుపు కనిపించకూడదని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇది కనిపించకుండా మాత్రం ఉండదు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో నోటి చుట్టూ ఉన్న నలుపును ఈజీగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కలబంద జెల్

కలబంద జెల్ మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఉండే ఔషదగుణాలు చర్మాన్ని క్లీన్ గా, గ్లోయింగ్ గా మార్చడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. దీన్ని పెదవుల చుట్టూ ఉన్న చర్మంపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. కలబంద జెల్ లో విటమిన్ -ఇ కూడా కలుపుకోవచ్చు. ఇది నలుపును పోగొడుతుంది. 

రోజ్ వాటర్ 

రోజ్ వాటర్ కూడా ఎన్నో చర్మ సమస్యలను పోగొడుతుంది. మొత్తం ముఖం రంగును మెరుగుపరచడంలో రోజ్ వాటర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అయితే పెదవుల చుట్టూ ఉన్న చర్మం నలుపు  రంగులో ఉంటే అక్కడ రోజ్ వాటర్ లో తేనె కలిపి అప్లై చేయాలి. కావాలంటే మీరు రోజ్ వాటర్ తో కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇది చర్మ రంగును మెరుగుపరుస్తుంది.
 

బంగాళాదుంప రసం 

బంగాళాదుంపలో రంగును మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ బంగాళాదుంప రాన్ని మూతిచుట్టూర అప్లై చేయండి. దీనివల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. నోటి చుట్టూ నలుపు ఉంటే బంగాళాదుంప రసాన్ని బయటకు తీసి కాటన్ సహాయంతో అప్లై చేయాలి.
 

నిమ్మరసం 

స్కిన్ టానింగ్ లేదా నలుపును తొలగించడానికి మీరు తేనెలో నిమ్మరసాన్ని కలిపి వాడొచ్చు. ఇది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

పెరుగు అప్లై చేయండి 

నోటి చుట్టూ ఉన్న చర్మం ఎక్కువగా పొడిబారడం వల్ల చర్మం నల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు. దీన్ని తగ్గించుకోవాలంటే పెరుగును అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత సాదా నీటితో కడిగేయండి.
 

బొప్పాయి, తేనె 

నోటి చుట్టూ ఉన్న నలుపైనా కావొచ్చు లేదా మెడ నలుపైనా కావొచ్చు. బొప్పాయి నలుపును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పండిన బొప్పాయి గుజ్జును తీసుకుని అందులో తేనె కలిపి రాసుకోండి. ఈ రెండు పదార్థాలు స్కిన్ టోన్ ను మెరుపరుస్తాయి. 

హైడ్రేటెడ్ గా ఉండండి 

నోటి చుట్టూ  ఉన్న నలుపునకు శరీరంలో నీరు లేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే నీటిని పుష్కలంగా తాగండి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోండి.
 

Latest Videos

click me!